జపనీయుల వాకింగ్ డిస్‌ప్లేన్ చూశారా.. ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోన్న వీడియో..

జపాన్( Japan ) దేశంలో చాలామంది ప్రజలు మంచి క్రమశిక్షణతో ప్రవర్తిస్తుంటారు.ఇతరుల పట్ల మంచి మర్యాద చూపిస్తారు.

 Have You Seen The Walking Display Of The Japanese An Inspiring Video , Viral New-TeluguStop.com

అధికారులు పెట్టిన రూల్స్‌కి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు.రూల్స్ అతిక్రమించేందుకు ఎవరూ కూడా అస్సలు ప్రయత్నించరు.

అందుకే జపాన్‌ ఇతర దేశాల కంటే చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.జపాన్ జనాల లాగా ఉండాలని అనేక దేశాల ప్రజలు ఎంతో కోరుకుంటారు, కానీ అది అంత సులభం కాదు.

కొన్ని కారణాలు బహిరంగ ప్రదేశాల్లో నియమాలను పాటించడం కష్టతరం చేస్తాయి.

ఈ క్రమంలోనే ఒక వ్యక్తి జపాన్, భారతదేశాన్ని పోల్చడానికి ప్రయత్నించాడు.జపనీస్ ప్రజలు మెట్లు ఎక్కేటప్పుడు లైన్‌లో ఎలా నిలబడతారో తెలిపే వీడియోను షేర్ చేశాడు.“భారతదేశం జపాన్‌లా ఎప్పటికైనా మారగలదా?” అని అడిగాడు.చాలా మంది ఈ వీడియోను చూసి దాని గురించి మాట్లాడటం ప్రారంభించారు.

“జపాన్ ప్రజలు భారతదేశానికి వస్తే, వారు నిబంధనలను పాటించరు.దీనికి కారణం ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ లేకపోవడమే.అంతేకాదు ఇతర భారతీయ పౌరులు బ్రేక్ రూల్స్ చేసి వేరే వారిని కూడా అలానే చేయమని ప్రేరేపిస్తారు.జపాన్‌లో, ప్రజలు కొన్ని నిమిషాలే వృధా చేస్తారు.భారతదేశంలో మాత్రం పనికి చాలా ఆలస్యంగా వస్తారు.ఇండియాలో చాలా మంది ఉన్నారు.వనరులను బాగా ఉపయోగించుకుంటారు, నిబంధనలను కాదు.” అని నెటిజన్లు ఈ వీడియో పోస్ట్ కింద కామెంట్లు చేస్తున్నారు.

భారతీయులు జపాన్ లాగా ఉండవలసిన అవసరం లేదు.వారి నుంచి ఏది నేర్చుకోవాల్సిన పనేలేదు.భారతీయులు వారు చేసే పనిలో సమర్థవంతులుగా ఉన్నారు.

ప్రపంచ దేశాలను ఏలుతున్నారు.భారతీయ సంస్కృతి ( Indian culture )పరిస్థితులు వేరేలా ఉంటాయి ఒక దేశాన్ని చూసి వాతలు పెట్టుకోవడం కుదరని పని అని మరికొందరు అన్నారు.

“మనం ఎవరినీ కాపీ చేయవలసిన అవసరం లేదు.జపాన్‌కు దాని సొంత సమస్యలు ఉన్నాయి.

కొంత మంది పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను చంపేస్తుంటారు.ప్రతి సంస్కృతి ప్రత్యేకమైనది, అందమైనది.

” అని ఇంకొకరు కామెంట్ చేశారు.మొత్తం మీద ఇండియా గొప్పతనాన్ని చాటే లాగా భారతీయులు కామెంట్లు చేశారు.

వైరల్ అవుతున్న వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube