ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు 10 నుంచి 15 ఏళ్ళు రాగానే డబ్బులు సంపాదిస్తున్నారు.వారు తమ ప్రత్యేకమైన టాలెంట్స్ చూపిస్తూ పాపులర్ కూడా అవుతున్నారు.
తాజాగా ఒక బాలుడు సైకిల్ పై వీలీ స్టంట్ చేస్తూ, ఆ ప్రత్యేకమైన ప్రతిభను డబ్బులు సంపాదించే సాధనంగా మార్చేశాడు.ఈ బాలుడు చాలా డబ్బు సంపాదించగా, దానికి సంబంధించిన వీడియోను క్రేజీ క్లిప్స్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.24 సెకన్ల వీడియోకి ఇప్పటికే 85 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.
వైరల్ వీడియోలో సదరు బాలుడు తన నిక్కర్ జేబు నుంచి వందల సంఖ్యలో ఉన్న డాలర్ నోట్లను( Dollar notes ) బయటికి తీయడం మనం చూడవచ్చు.ఆ తర్వాత సైకిల్ మందు “వీలీ ఫర్ వన్ డాలర్” ( Wheeley for One Dollar )అని రాసిన ఒక ప్లకార్డు కనిపించింది.మరో క్షణంలో బాలుడు తన దగ్గర ఇంకో డాలర్ల కట్ట కూడా ఉందని నోట్లు చూపించాడు.
దాంతో వీడియో తీస్తున్న వ్యక్తి ఆశ్చర్యపోయాడు.కనీసం అతని దగ్గర 200 డాలర్లు ఉన్నా అవి దాదాపు రూ.17వేలతో సమానమని చెప్పుకోవచ్చు.ఈ డబ్బులు ఇండియాలో కొంతమంది నెల అంతా సంపాదించే జీతానికి సమానం.
అంత పెద్ద అమౌంట్ ను ఈ పిల్లోడు సైకిల్ పై స్టంట్స్ చేస్తూ ఈజీగా సింగిల్ డేలో సంపాదించినట్లు ఉంది.అది అతడికి ఒక పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు.వీడియో చివరిలో ఇంకా డబ్బు సంపాదించేందుకు సదరు బుడ్డోడు సైకిల్ పై దూసుకెళ్లడం మనం గమనించవచ్చు.ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లోడిని పొగుడుతున్నారు.మరికొందరు అంత డబ్బు దగ్గర ఉంటే ఎవరైనా బెదిరించి లాక్కోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.పోలీసుల ముందే ఈ బాలుడు చాలా ధైర్యంగా సైకిల్ పై వీలీ చేస్తూ ఆశ్చర్యపరిచాడని ఇంకొందరు అన్నారు.