సినిమా ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ పోటీ వాతావరణం ఉంటుంది.హీరో హీరోకి మధ్య పోటీ ఉంటుంది.
అలాగే దర్శకులకి కూడా పోటీ నడుస్తుంది.నిర్మాతలకు కూడా కలెక్షన్స్ పరంగా ఎప్పుడు పోటీ ఉంటూనే ఉంటుంది.
అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య కొత్తగా పోటీ వాతావరణం కనిపిస్తుంది.అది కూడా దిల్ రాజు వల్లే సాధ్యమైంది.
దిల్ రాజు( Dil Raju ) మొదటి నుంచి డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆ తర్వాత సినిమాలు ప్రొడ్యూస్ చేయడం కూడా మొదలుపెట్టారు.
చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ సినిమాకు ప్రొడ్యూసర్స్ గా మారి డబ్బులు పోగొట్టుకొని డిస్ట్రిబ్యూషన్ చేయలేక ఇక సినిమాలు తీయలేక చేతులెత్తేస్తుంటారు.కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దిల్ రాజు మాత్రం ఇండస్ట్రీలోనే పాతుకపోయారు.
పైగా దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్( Distribution ) రంగంలో చాలా గట్టిగా ఉన్నారు.ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అనేక థియేటర్ లు ఆయన కను సన్నల్లో నడుస్తూ ఉంటాయి.
ఏ సినిమా గురించి రిలీజ్ టాపిక్ వచ్చిన అక్కడ దిల్ రాజు హ్యాండ్ ఖచ్చితంగా ఉండాల్సిందే.అయితే దిల్ రాజుకు పోటీగా ఏ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు అనేది చాలా పెద్ద ప్రశ్న.
ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆచార్య, లైగర్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి వరంగల్ శీను( Warangal Srinu ) దాదాపు ఆ పోటీ నుంచి కనుమరుగయ్యారు.
ఆ రెండు సినిమాల నుంచి దాదాపు 100 కోట్లు పోగొట్టుకొని ఆయన ప్రస్తుతం కోలుకోలేని పరిస్థితులలో ఉన్నారనే చెప్పుకోవచ్చు.కానీ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కొత్తగా మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) డిస్ట్రిబ్యూషన్ లోకి తమ సొంత సినిమాలతోనే దిగారు.
వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాలను వారే డిస్ట్రిబ్యూట్ చేసుకుని విజయాల బాట పట్టారు. దిల్ రాజు కూడా తన సొంత సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాడు.
అదే వారసుడు చిత్రం. ఈ విషయంలో ఆ మద్య థియేటర్ కు సంబంధించి గొడవలు జరిగిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు సంక్రాంతికి కూడా వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉండేలా కనిపిస్తుంది.ఎందుకంటే దిల్ రాజు మహేష్ బాబు గుంటూరు కారం( Guntur Karam Movie ) నైజాం హక్కులను దక్కించుకోగా, మైత్రి మూవీ మేకర్స్ చిన్న హీరో సినిమా అయినా హనుమాన్ చిత్రాన్ని( HanuMan Movie ) డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.ఈ రెండు సినిమాల్లో గుంటూరు కారం కి మంచి హిట్ టాక్ అయితే వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న హనుమాన్ చిత్రాన్ని కూడా పక్కన పెట్టేయడానికి లేదు.మరి మైత్రి మూవీ మేకర్స్ హనుమాన్ చిత్రంతో దిల్ రాజు ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తారా లేదా వరంగల్ శ్రీను లాగా పక్కకు వెళ్ళిపోతారా అనేది తెలుసుకోవాల్సి ఉంది.