నందమూరి నటసింహంగా పేరు పొందిన బాలయ్య బాబు( Balakrishna ) తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ కొడుకుగా పరిచయమైన బాలయ్య చాలా తక్కువ టైంలోనే మంచి విజయాలను అందుకొని నందమూరి నటవారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు అయితే చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు కు మంచి సక్సెస్ లు ఇచ్చిన డైరెక్టర్లలో మొదటి స్థానంలో బి గోపాల్ ఉంటే బోయపాటి శ్రీను రెండవ స్థానం లో నిలిచాడు.
ఒకానొక టైంలో బి.గోపాల్( B Gopal ) బాలయ్య బాబుతో వరుసగా సినిమాలు చేసి మంచి హిట్లు ఇచ్చి అతన్ని టాప్ రేంజ్ లో కూర్చోబెడితే ఇక ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతున్న బాలయ్య ని మరోసారి తన సినిమాలతో టాప్ పొజిషన్ కి తీసుకొచ్చిన డైరెక్టర్ బోయపాటి శీను…( Boyapati Srinu ) బి గోపాల్, బోయపాటి శ్రీను వీరిద్దరూ కూడా బాలయ్య బాబుకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటారు.

ఇక వీళ్ళ కాంబినేషన్ లో అలాంటి సినిమాలు వచ్చాయి.ముఖ్యంగా బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో అయితే మూడు సినిమాలు రావడం ఆ మూడు సినిమాలు కూడా వరుసగా సక్సెస్ లు సాధించడంతో ఇప్పుడు నాలుగొవ సినిమా మీద అందరి ఆసక్తి నెలకొంది.అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు ఒక క్యారెక్టర్ లో ఆర్మీ మేజర్ గా నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో కూడా బాలయ్య బాబు డ్యూయల్ రోల్ లో( Balayya Dual Role ) నటిస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఒక క్యారెక్టర్ ఆర్మీ మేజర్ కాగా, మరొక క్యారెక్టర్ ఏంటి అనేది మాత్రం సస్పెన్స్ నెలకొంటుంది.అయితే ఈ పాత్రల మీద బోయపాటి శ్రీను గానీ చిత్ర యూనిట్ గాని ఇప్పటివరకు ఎలాంటి స్పందన అయితే తెలియజేయలేదు అయితే ప్రస్తుతం బాలయ్య బాబు బాబీ తో చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన వెంటనే బోయపాటితో చేసే సినిమా తెరపైకి రానున్నట్టుగా తెలుస్తుంది…
.







