పది రూపాయలకే వైద్యం.. అనవసర మందులు రాయని డాక్టర్..ఈ డాక్టర్ మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో 10 రూపాయలకు ఏం వస్తుందనే ప్రశ్నకు ఎవరి దగ్గర సరైన సమాధానం కూడా ఉండదు.పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వల్ల ఎంత ఎక్కువ మొత్తంలో వేతనం వస్తున్నా సరిపోవడం లేదని చాలామంది చెబుతున్నారు.

 Ten Rupees Doctor In Tirupati Details Here Goes Viral In Social Media , Social-TeluguStop.com

అయితే తిరుపతిలోని ( Tirupati )ఒక వైద్యుడు మాత్రం కేవలం 10 రూపాయలకే వైద్యం అందిస్తూ ప్రశంసలు అందుకుంటూ ఉండటం గమనార్హం.

ఓపీ కోసం కేవలం 10 రూపాయలు ఫీజుగా తీసుకుంటున్న తిరుపతి ఆయుర్వేదిక్ డాక్టర్ వెంకటరామయ్య( Ayurvedic Doctor Venkataramaiah ) పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతోంది.

సుందరయ్య నగర్ లో ఈ డాక్టర్ క్లినిక్ ను నిర్వహిస్తున్నారు.వైద్య విద్యలో గోల్డ్ మెడల్ సాధించిన వెంకట రామయ్య ఇంత తక్కువ ధరకు వైద్యం అందించడం అంటే ఆయన ఎంతో మంచి వ్యక్తి నెటిజన్లు చెబుతున్నారు.

Telugu Prashanti, Rupees, Tirupati, Venkata Ramaiah-Inspirational Storys

తన దగ్గరకు వచ్చే రోగుల దగ్గర ఆ పది రూపాయలు కూడా లేకపోతే ఉచితంగా వైద్యం అందించే విషయంలో వెంకటరామయ్య ముందువరసలో ఉండేవారు.ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నాకు సరిపోయేంత డబ్బు వస్తుందని ఆయన చెబుతున్నారు.ప్రశాంతి వైద్యశాల( Prashanti Hospital ) పేరుతో ఆయన క్లినిక్ ను నిర్వహిస్తున్నారు.బాల్యంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆయన చెబుతున్నారు.

Telugu Prashanti, Rupees, Tirupati, Venkata Ramaiah-Inspirational Storys

డబ్బులు లేకపోయినా చదివి చూపించాలని భావించి కష్టపడ్డానని ఆయన చెప్పుకొచ్చారు.ఇంట్లో వాళ్ల సహాయసహకారాలు లేకపోయినా డాక్టర్ అయ్యానని అప్పట్లోనే మంచి ర్యాంక్ సాధించానని వెంకట రామయ్య చెబుతున్నారు.సమాజానికి అంతోఇంతో మనం చేసి చూపించాలని తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.వెంకటరామయ్య చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.వెంకటరామయ్య లాంటి డాక్టర్లు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని చెప్పవచ్చు.తక్కువ ధరలకే వైద్య సేవలు లభించడం ద్వారా ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube