సాధారణంగా తెలియని వ్యక్తుల దగ్గరకు కుక్కలు రావు.పిలిస్తే గుర్రుమంటూ వాటి దారిన అవి వెళ్లిపోతాయి.
లేదంటే ఏదైనా ఆహారం పెడతారని చేతుల వైపు చూసి తోక ఊపుతాయి.కానీ దగ్గరికి అస్సలు రావు.
ఒకవేళ వచ్చినా వాటి పైన చేయి పెడితే కరిచేస్తాయి.కానీ కొన్ని కుక్కలు ( DOGS )మాత్రం పిలవగానే వచ్చి ఏదో జన్మజన్మల అనుబంధం ఉన్నట్లు చేతులు నాకుతాయి.
ఒడిలో పడుకుంటాయి.వెంటే వస్తాయి.
అవి క్షణాల్లోనే యజమాని పోస్ట్‌ను అపరిచితులకు ఇచ్చేస్తాయి.తాజాగా అలాంటి కుక్కకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.
@Bestfightclip ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 37 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.
వైరల్ వీడియో( Viral video ) ఓపెన్ చేస్తే ఒక యువతి కారు డ్రైవ్ చేస్తూ వెళ్లడం మనం చూడవచ్చు.ఆ యువతి వెళ్తున్న హైవే పైన ఒక కుక్క అడ్డంగా వచ్చింది.దాంతో ఆమె బ్రేక్ వేసింది.తర్వాత డోర్ తెరిసి కమాన్ కమాన్ కారు ఎక్కు అన్నది.అంతే కుక్క వెంటనే కారు ఎక్కి కూర్చుంది.దాంతో సదరు యువతి కూడా ఆశ్చర్యపోయింది.
ఈ కుక్క మెడలో ఒక ట్యాగ్ ఉంది.దానిని కావాలనే వదిలేసారా, లేదంటే తప్పిపోయిందా అనే వివరాలు తెలియ రాలేదు.
ఆ ట్యాగ్ బట్టి యజమానికి తిరిగి కావాలంటే యువతి ఈ కుక్కను ఇవ్వచ్చు, లేదంటే ఆమె పెంచుకునే అవకాశం ఉంది.ఏది ఏమైనా ఈ కుక్కకైతే ఒక మంచి హోమ్ దొరికింది.
ఈ వీడియో చూసిన చాలామంది కుక్క చాలా బాధలో ఉన్నట్లుంది, ఎవరు పిలిస్తే వారి దగ్గరికి వెళ్లి సహాయం తీసుకోవాలనుకుంటుందేమో అని అన్నారు.ఆ హైవేపై కుక్కకు( Dog ) ఎలాంటి ప్రమాదం జరగకముందే దానిని కాపాడిన ఈ యువతికి ధన్యవాదాలు తెలుపుకోవాలని మరికొందరు పేర్కొన్నారు.