వాము ఆకు( ajwain leaves ).ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నివారించడానికి, పేగు కదలికలను మెరుగుపరచడానికి వాము ఆకు అద్భుతంగా సహాయపడుతుంది.అయితే పొట్టకే కాదు జుట్టుకు కూడా వాము ఆకు మంచిదే.
ముఖ్యంగా వాము ఆకును ఇప్పుడు చెప్పబోయే విధంగా కనుక వాడితే మీ కురులు వద్దన్నా కూడా దట్టంగా పెరుగుతాయి.
అందుకోసం ముందుగా ఐదు నుంచి ఆరు వాము ఆకులు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టాలి.అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( coconut oil ) వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న వాము ఆకుతో పాటు రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ), వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( cloves ) వేసి చిన్న మంటపై దాదాపు పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

దాంతో వాము ఆకు కలర్ చేంజ్ అవుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకుంటే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది.
ఈ ఆయిల్ ను నైట్ నిద్రించే ముందు స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.

మరుసటి రోజు మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండంటే రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక తలకు రాస్తే జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే దట్టంగా మారుతుంది.కొద్ది రోజుల్లోనే ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.
అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.ఫలితంగా హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.







