బాలీవుడ్ లో ఎవరైనా నిలబడాలి అంటే బాలీవుడ్( Bollywood ) గుప్పెట్లోకి వెళ్లిపోవాలి.లేదంటే ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి.
ఈ రెండు కాదంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్( Sushant Singh Rajput ) లాగ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలి.అంతేగాని ఎదురుగా నిలబడాలి అనుకుని పోరాటం చేసిన వారికి ఇప్పటి వరకు ఫలితం దక్కింది లేదు.
కానీ ఎక్కడో సౌత్ నుంచి ఒకడు వచ్చి నిలబడ్డాడు అంటే అది చిన్న విషయం ఏమి కాదు.ఆ ఘనత దక్కించుకుంది ప్రభాస్( Prabhas ) మాత్రమే.
మొదట బాహుబలితో పరవాలేదు అనిపించుకున్నాడు కానీ ఆ తర్వాత మూడు నాలుగు వరస ప్లాపులు వచ్చేసరికి అతడు పని అయిపోయిందని బాలీవుడ్ పక్కన పెట్టేసింది.కానీ మన ప్రభాస్ కి సలార్( Salaar ) రూపంలో గట్టి హిట్టు దక్కడం తో బాలీవుడ్ సిండికేట్ అంత ఉడికిపోతుంది.
మరి అలాంటి ఒక సిండికేట్ మెడలు వంచడానికి అంత ఈజీగా ప్రభాస్ స్టామినా సరిపోదు.ప్రభాస్ లో చాలా అవలక్షణాలు ఉన్నాయి.

అవి అన్ని మంచి లక్షణాలే కానీ అవలక్షణాలు అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే అవి ఉంటే బాలీవుడ్ లో ఉంటె రాణించడం చాలా కష్టం.ముఖ్యంగా బాలీవుడ్ లో తనను తాను హైప్ చేసుకోవాలని ఏ రోజు ప్రభాస్ ప్రయత్నించలేదు.ఆర్టిఫిషియల్ గా హైప్ తెచ్చుకోవడం తనకు ఇష్టం ఉండదు.ఎలాంటి పీఆర్ టీమ్స్ ని కూడా మైంటైన్ చేయలేకపోతున్నాడు.
చేయడం తన వల్ల కాదు కూడా.పైగా పక్క హీరోల సినిమాల విషయంలో కుట్రలు చేయడం కూడా ప్రభాస్ కి చేతకాదు.
తన సర్కిల్ లో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిస్తే వారికోసం కథ ఎలా ఉన్నా సినిమా చేయడానికి ప్రభాస్ ముందుకు వస్తాడు.ఇప్పుడు మారుతితో( Director Maruthi ) రాజా డీలక్స్( Raja Deluxe ) సినిమా అలాగే మొదలయింది.

కృత్రిమంగా తన సినిమాలను హిట్టు చేసుకోలేడు.పైగా రెండు మూడేళ్లకోసారి సినిమాలు తీస్తాడు.తన అనుకున్న వారికి తిండి పెట్టి చంపేస్తాడు ప్రేమతో అనే మాట కూడా ఎప్పటినుంచో ఉంది.అతని మంచితనం అలాంటిది.జనరల్ గా స్టార్ హీరోలలో ఉండే ఏ లక్షణాలు కూడా ప్రభాస్ కి ఉండవు.పిచ్చి వేషాలు, పబ్లిసిటీ గొప్పలు తన వల్ల కాదు.
అందుకే ఆది పురుష్( Adipurush ) చిత్రంలో ఫ్లాప్ అయ్యింది.కానీ ఆ నిర్మాణ సంస్థ ప్రభాస్ కి ఎప్పుడు మంచి అభిమానులే.
అందుకే స్పిరిట్ సినిమా( Spirit Movie ) తనతోనే తీయాలని సందీప్ రెడ్డిని( Sandeep Reddy ) లాక్ చేశారు.అది కేవలం ప్రభాస్ పై ఉన్న అభిమానంతోనే.
ఇన్ని లక్షణాలు ఉండటం వల్ల బాలీవుడ్ లో ఎదగాలంటే చాలా కష్టమని అవి అవలక్షణాలని అనాల్సి వస్తుంది.అవి దాటితే కచ్చితంగా ప్రభాస్ రెగ్యులర్ బాలీవుడ్ హీరో అయిపోతాడు.







