తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి.ఇంకో కొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి.
ఈ క్రమంలోనే అక్కడ ప్రధాన పార్టీలు అయినటువంటి టిడిపి, వైఎస్ఆర్సిపి (YSRCP) మధ్య విపరీతమైనటువంటి పోటీ నెలకొనే అవకాశం ఉంది.
ఈ ఇద్దరి పోటీలో జనసేన (Janasena) సెంట్రల్ ఆఫ్ ఫిగర్ గా మారే అవకాశం కనిపిస్తోంది.
ఇదే తరుణంలో జనసేన పార్టీ ఇప్పటికే చంద్రబాబుతో పొత్తుతో పోటీ చేస్తుందని ప్రకటన జారీ అయిన విషయం అందరికీ తెలిసిందే.మరి పొత్తులో భాగంగా జనసేన ఎన్ని సీట్లు అడుగుతోంది.
వారు అడిగిన సీట్లు చంద్రబాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా.ఒకవేళ డీల్ కుదరకుంటే జరిగే పరిణామం ఏంటి.
అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని అనేక ప్లాన్లు వేస్తోంది.ఇప్పటికే జగన్ (Jagan) అన్ని అసెంబ్లీ స్థానాలపై సర్వే చేయించి వ్యతిరేకత ఉన్నటువంటి వారికి ఈసారి సీట్లు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.వాళ్లు ఎంత దగ్గర వారైనా సరే మార్పు తప్పనిసరి చేయాలని అనుకుంటున్నారట.
ఈ క్రమంలోనే సీట్లు కోల్పోయే కొంతమంది నేతలను ముందుగానే క్యాంప్ ఆఫీస్ కు పిలిచి రకరకాలుగా బుజ్జగిస్తున్నారని తెలుస్తోంది.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే ఈసారి జగన్ ను ఓడించి ఎలాగైనా అధికారంలోకి రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదే తరుణంలో ఆయన కొడుకు లోకేష్ యువగలం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టి కాస్త మైలేజ్ తీసుకువచ్చారు.అలాగే చంద్రబాబు (Chandrabbau) అరెస్ట్ కూడా పార్టీకి ఎంతో కలిసొచ్చిందని చెప్పవచ్చు.
ఈసారి తప్పకుండా జనసేనతో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వస్తామని భావిస్తున్నారు.

ఇదంతా బాగానే ఉన్నా కానీ అసలు తలనొప్పి పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తో వచ్చింది.పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ 40 నుంచి 50 సీట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఆ సీట్లు కూడా గెలిచే సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారట.
కానీ టిడిపి మాత్రం 27 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలు ఇస్తామని అంటుందట.దీనికి పవన్ కళ్యాణ్ ససేమిరా అనడంతో ఆయన ఓప్పించడం చంద్రబాబుకు కష్టంగా మారిందని తెలుస్తోంది.
ఎంత సర్ది చెప్పినా పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం లేదట.అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు కూడా అంత తక్కువ సీట్లు అయితే మనకు పొత్తుతో ప్రయోజనం ఉండదని భావిస్తున్నారట.
ఈ క్రమంలోనే టిడిపి జనసేన (TDP,Janasena) మధ్య సీట్ల సర్దుబాటు చంద్రన్నకు తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు.