Sandeep Reddy Vanga : సందీప్, ప్రశాంత్ వద్దకు క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోలు.. ఒక్క హిట్ కావాలంటూ..

యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వం( Sandeep Reddy vanga )గా, కేజిఎఫ్, సలార్ సినిమాలతో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయ్యారు.ఈ నెల చివరాఖరిలో తమ సినిమాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ డైరెక్టర్లు భారీ విజయాలను సాధించారు.

 Heros Who Are Waiting For Sandeep Reddy Vanga And Prashanth Neel-TeluguStop.com

సందీప్ తీసిన యానిమల్ సినిమా సంచలనంగా మారి సూపర్ డూపర్ హిట్ అయింది.అందువల్ల ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు సందీప్ తో కలిసి ఒక సినిమా తీయడానికి ఆశపడుతున్నారు.

ఇక భారతదేశవ్యాప్తంగా ఉన్న పాన్ ఇండియా హీరోలు ప్రశాంత్‌ నీల్‌తో కూడా కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Telugu Salaar, Aamir Khan, Animal, Bollwood, Prashant Neel, Salman Khan, Sandeep

ఇటీవల కాలంలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ( Aamir Khan Salman Khan )వంటి హీరోలు ఒక హిట్ కూడా కొట్టలేకపోయారు.పైగా వారు దారుణమైన ఫ్లాప్స్ అందుకున్నారు.వేరే డైరెక్టర్లను నమ్ముకుంటే ఇలాంటి ఫ్లాప్స్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు.

అందుకే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లతో కలిసి మూవీలు తీసేందుకు సిద్ధమవుతున్నారు.వారి వెంటపడుతూ మరీ డేట్స్ కోసం అడుగుతున్నారు.

Telugu Salaar, Aamir Khan, Animal, Bollwood, Prashant Neel, Salman Khan, Sandeep

అమీర్ ఖాన్ ఇప్పటికే ప్రశాంత్‌ నీల్‌( prashanth neel )ను సంప్రదించి తనతో ఒక సినిమా చేయాలని కోరినట్లు తెలుస్తోంది.అయితే ప్రశాంత్ నీల్‌కు వేరే సినిమాల కమిట్మెంట్లు ఉన్నాయి కాబట్టి నాలుగు సంవత్సరాల వరకు తాను ఫ్రీ అవ్వలేనని, అప్పుడు మాత్రమే సినిమా చేయడానికి ఆలోచిస్తానని చెప్పాడట.దాంతో అమీర్ చాలా డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది.సలార్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ లో ప్రశాంత్‌కు క్రేజ్ మరింత పెరిగిపోయింది.అమీర్ మాత్రమే కాకుండా మరి కొంతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఇతడిని సంప్రదిస్తున్నట్లు టాక్‌ నడుస్తోంది. సలార్ మూవీని( Salaar ) ప్రశాంత్ అద్భుతంగా తీశాడు ఎలివేషన్స్ తో ప్రభాస్ ను చాలా చక్కగా చూపించాడు.

అలాంటి కిక్కిచ్చే సినిమాల్లో చేయాలని మిగతా స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు.మరోవైపు డైరెక్టర్ సందీప్ రెడ్డి వెంట బాలీవుడ్ హల్క్ హృతిక్ రోషన్ లాంటి ఓ స్టార్ హీరో పడుతున్నట్లు సమాచారం.

అతను ఒక సినిమా చేద్దాం సార్ అంటూ బాగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.కానీ ఈ డైరెక్టర్ కూడా ప్రస్తుతం ఖాళీగా లేడు.

అందువల్ల తర్వాత చూద్దామని చెప్పినట్లు తెలుస్తోంది.మొత్తం మీద బాలీవుడ్ స్టార్ హీరోలు హిట్ కొట్టడం కోసం సౌత్ ఇండియన్ డైరెక్టర్ల వెనుక పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube