Pallavi Prashanth : సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న పల్లవి ప్రశాంత్.. రైతుబిడ్డను ప్రేక్షకులు ఆదరిస్తారా?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ( Pallavi prashanth )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వక ముందు వరకు పల్లవి ప్రశాంత్ ఎవరు అన్న విషయం చాలామందికి తెలియదు.

 Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Getting Movie Offers Tollywood-TeluguStop.com

కానీ బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss Season 7 ) లోకి ఎంట్రీ ఇచ్చి బీభత్సమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు.అంతే కాకుండా సీజన్ సెవెన్ విన్నర్ గా కూడా నిలిచాడు.

మొదట రీల్స్ ద్వారా బాగా ఫేమస్ అయిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అని సంకల్పంతో అనుకున్నది సాధించాడు.ఫలితంగా బిగ్ బాస్ సీజన్ 7 లో ఛాన్స్ లభించింది.

Telugu Bhole Shavali, Bigg Boss, Tollywood-Movie

అలా ఒక కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి సెలెబ్రిటీ అయ్యాడు.అంచనాలు తలక్రిందులు చేస్తూ టైటిల్ విన్నర్ అయ్యాడు.అయితే పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన ఫ్యాన్స్ అత్యుత్సాహం జైలుపాలు అయ్యేలా చేసింది.పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పబ్లిక్, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు.పల్లవి ప్రశాంత్ పోలీసుల మాట పెడచెవిన పెట్టి ర్యాలీ చేసి వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాడు.అదంతా పక్కన పెడితే.

పల్లవి ప్రశాంత్ కి సినిమా ఆఫర్స్ వస్తున్నాయి.అతడు ఓకే అంటే హీరోగా చిత్రాలు నిర్మించడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారన్న విషయం భోలే షావలి ( Bhole Shavali )బయటపెట్టాడు.

ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న భోలే.హౌస్ లో ఉన్నప్పుడే పల్లవి ప్రశాంత్ కి సినిమా ఆఫర్స్ వచ్చాయి.

బయటకు రాగానే ఇదే విషయం చెప్పాలి అనుకున్నాను.అనూహ్యంగా అతడు అరెస్ట్ అయ్యాడు.

Telugu Bhole Shavali, Bigg Boss, Tollywood-Movie

రైతుబిడ్డ హీరోగా పాట బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమా చేయమని అడుగుతున్నారు.అయితే అది పల్లవి ప్రశాంత్ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.అతడు అవును అంటే త్వరలో సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తాడన్న షాకింగ్ మేటర్ లీక్ చేశాడు.భోలే షావలి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ కామెంట్స్ పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.అందరూ వాడు హీరో ఏంటి అంటూ నెగిటివ్ గా స్పందిస్తుండగా, ఆల్ ది బెస్ట్ పల్లవి ప్రశాంత్ అప్ కమింగ్ హీరో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube