పాలకూర సాగు చేయాలంటే..మేలు రకం పాలకూర సాగు రకాలు ఇవే..!

రైతులు ( Farmers )ఏ పంటను సాగు చేయాలి అనుకున్నా ముందుగా ఆ పంట సాగు విధానంపై అవగాహన ఉండడంతో పాటు సాగుకు మేలైన రకాలు ఏవో కూడా అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.రైతులకు సాగుకు మేలు రకం విత్తనాలు, ఎరువులు, చీడపీడలు( Pests ) తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే విషయాలపై అవగాహన ఉంటేనే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చు.

 If You Want To Cultivate Lettuce..the Best Types Of Lettuce Are These , Farmers-TeluguStop.com

ఆకుకూరల విషయానికి వస్తే.పాలకూర చాలా రుచిగా ఉండడంతో పాటు చాలా పోషక విలువలను కలిగి ఉంటుంది.

శరీరానికి రక్తం పట్టడానికి చాలామంది పాలకూరను ఎక్కువగా తింటారు.పాలకూరలో ఫైబర్, ఖనిజ లవణాలు ఎక్కువ.

అందుకే రైతులు పాలకూర సాగుపై అధిక ఆసక్తి చూపిస్తున్నారు.మరి పాలకూర సాగులో( Spinach Cultivation ) అధిక దిగుబడి పొందాలంటే మేలైన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.

ఆ మేలురకం రకాలు ఏమో చూద్దాం.

Telugu Agricultural, Farmers, Greens, Yield, Pusa Palak, Spinach-Latest News - T

పూసా పాలక్:( Pusa Palak ) ఈ రకాన్ని సాగు చేస్తే.విత్తే సమయాన్నిబట్టి ఆరు పంట కోతలు చేతికి వస్తాయి.ఈ పాలకూర ఆకులు పచ్చగా, మెత్తగా ఉంటాయి.

ఒక ఎకరం పొలంలో దాదాపుగా 50 క్వింటాళ్ల దిగుబడులు పొందవచ్చు.పూసా హరిత్: ఈ పాలకూర రకం వెడల్పాటి ఆకులను కలిగి ఉంటుంది.విత్తిన ఐదు నుంచి 8 వారాల తర్వాత మొదటి కోత చేతికి వస్తుంది.చల్లని ప్రాంతాల్లో పాలకూర సాగు చేయాలంటే ఈ రకం అత్యంత అనువైనది.జాబనర్ గ్రీన్: ఈ పాలకూర రకం ఆకుపచ్చని, దళసరి, మెత్తని ఏకరీతి ఆకులను కలిగి ఉంటుంది.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 100 క్వింటాళ్లకు పైగా దిగుబడి పొందవచ్చు.

Telugu Agricultural, Farmers, Greens, Yield, Pusa Palak, Spinach-Latest News - T

పాలకూర ( Spinach )అనేది ఉష్ణ ప్రాంతపు పంట కాబట్టి ఎంత చలి, మంచు ఉన్న తట్టుకొని నిలబడుతుంది.నీటి వనరులు సంపూర్ణంగా ఉంటే ఏడాదిలో ఏ సమయంలో అయినా ఈ పంట సాగు చేయవచ్చు కానీ నీరు నిల్వ ఉండే భూముల్లో ఈ పంట సాగు చేయకపోవడమే మంచిది.ఏ రకం సాగుచేసిన ఒక ఎకరాకు దాదాపుగా 11 కేజీల విత్తనాలు అవసరం.విత్తనాలను కాస్త దూరంగా నాటుకుంటే మొక్కలకు సూర్యరశ్మి, గాలి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube