కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ ( Sruthi Haasan ) పెళ్లి చేసుకుందా.బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉన్న వార్తలు మాకు తెలుసు కానీ ఈమె పెళ్లెప్పుడు చేసుకుంది అని ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు.
మరి శృతిహాసన్ నిజంగానే సీక్రెట్ గా తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుందా.ఇందులో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
విశ్వ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కేవలం హీరోయిన్ గానే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ గా కూడా చేసింది.అయితే శృతిహాసన్ కమలహాసన్ ( Kamal haasan ) పేరు ఏమాత్రం వాడుకోకుండా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకుంది.
అయితే ఈ సంవత్సరంలో మాత్రం శృతిహాసన్ చేసిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

అంతేకాదు ఇప్పటివరకు ఎవరైతే ప్లాఫ్ సినిమాలతో సతమత పడ్డారో వారందరికీ శృతిహాసన్ హిట్ ఇచ్చింది.అలా ఈ ఏడాది వాల్తేరు వీరయ్య,వీర సింహారెడ్డి హాయ్ నాన్న, సలార్ ( Salaar ) వంటి ఈమె చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి.అలా ఈ ఏడాది శృతిహాసన్ గోల్డెన్ లెగ్ గా మారిపోయింది.
అయితే తాజాగా శృతిహాసన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .ఇక అసలు విషయం ఏమిటంటే.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓరి ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ పెళ్లి చేసుకుందంటూ ఒక హింట్ ఇచ్చారు.

దాంతో కొన్ని వెబ్సైట్లు, మీడియా శృతిహాసన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందంటూ రాస్కొస్తున్నారు.అయితే దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది శృతిహాసన్.నేను పెళ్లి చేసుకున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
అన్ని విషయాలు మీకు చెప్పి చేసే నేను పెళ్లి విషయం మాత్రం ఎందుకు దాస్తాను.అంటూ క్లారిటీ ఇచ్చింది.ఇక శృతిహాసన్ గత కొద్ది రోజులుగా డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతాను హాజరిక ( Shanthanu hajarika ) తో రిలేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే.







