నందమూరి కళ్యాణ్ రామ్ ( Kalyan Ram ) త్వరలోనే డెవిల్ సినిమా( Devil Movie )ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ( NTR ) రాకపోవడంతో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు వచ్చాయి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.

ఇలా వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతోనే ఎన్టీఆర్ ఈ వేడుకకు దూరంగా ఉన్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.అయితే ఈ వార్తలు విన్నటువంటి నందమూరి అభిమానులు కొంతమేర ఫీలయ్యారు కానీ ఈ వార్తలపై కళ్యాణ్ రామ్ స్పందిస్తూ అందరికీ క్లారిటీ ఇచ్చారు.ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఈ విషయం గురించి మాట్లాడుతూ.

మాది అన్నదమ్ముల అనుబంధం తారక్ తో నా బంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు… చెరపలేరు అలాంటి ఆలోచనలు కూడా మానుకోండి అంటూ ఈయన ఘాటుగా సమాధానం చెప్పారు.ట్వీట్, తదితర నిర్ణయాల్లో మేమంతా ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.ఈవెంట్ల విషయంలోనూ మీకు ఉన్న అపోహలను మైండ్ లోని ఫస్ట్ తొలగించండి అంటూ ఎన్టీఆర్ తో తనకు ఏ విధమైనటువంటి విభేదాలు లేవు అని చెబుతూనే ఈయన కాస్త ఎమోషనల్ అయ్యారు.తన తండ్రి చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ లోనే తన తండ్రిని చూసుకుంటున్నారు.
కళ్యాణ్ రామ్ కు ఎన్టీఆర్ వరుసకు తమ్ముడు అయినప్పటికీ చాలా ఆప్యాయంగా ఎన్టీఆర్ ను నాన్న అని పిలుస్తూ ఉంటారు.అలాంటి వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అనడం కేవలం అపోహ మాత్రమేనంటూ ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.