టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ramcharan Tej) కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈయన వృత్తిపరమైనటువంటి జీవితంలో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఉపాసనని(Upasana )ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి రామ్ చరణ్ పెళ్లైనటువంటి 11 సంవత్సరాలకు తల్లిదండ్రులకు ప్రమోట్ అయ్యారు.ఇక ఈ దంపతులు ఆడబిడ్డకు జన్మనివ్వడమే కాకుండా చిన్నారికి క్లిన్ కారా (Klin karaa).అని నామకరణం కూడా చేశారు.ఈ చిన్నారికి ఇప్పటికే ఆరు నెలలు పూర్తి అయ్యాయి.
ఇలా మెగా వారసురాలికి ఆరు నెలలు పూర్తి అయినప్పటికీ ఉపాసన రాంచరణ్ మాత్రం తమ కూతురు ఎలా ఉంటుందనే విషయాలను మాత్రం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేయలేదు.దీంతో మెగా అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
మెగా వారసురాలిని ఎప్పుడెప్పుడు చూడాలా అంటూ ఆత్రుత కనబరుస్తున్నారు.ఇకపోతే క్రిస్మస్ పండుగ సందర్భంగా మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఉపాసన సోషల్ మీడియా వేదికగా తన కూతురితో కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.

రామ్ చరణ్ కుమార్తె క్లిన్ కారా కూడా శాంటా క్లాస్ వేషంలో కనిపించి సందడి చేశారు.ఇలా శాంటా క్లాస్ గా తయారైనటువంటి తన ముద్దుల కుమార్తెను రామ్ చరణ్ ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నటువంటి ఫోటోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫోటోలో ఉపాసన కూడా కనిపిస్తున్నారు ఇలా తండ్రి కూతురు మధ్య ఉన్నటువంటి ప్రేమను చూసి ఈమె కూడా మురిసిపోతున్నారు.
ఉపాసన ఈ ఫోటోని షేర్ చేస్తూ బెస్ట్ డాడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఈ ఫోటోని చూసిన అభిమానులకు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ చిన్నారి ఫేస్ రివిల్ చేయకపోవడంతో నిరుత్సాహం కూడా వ్యక్తం చేస్తున్నారు.