మరోసారి అంగన్ వాడీలతో చర్చలు విఫలం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు వారాల నుండి అంగన్ వాడీ వర్కర్ లు,( Anganwadi Workers ) హెల్పర్ లు ఆందోళనలు చేపడుతున్నారు.తమ డిమాండ్లను పరిష్కరించాలని జీతాల పెంపుదలతో పాటు ఆర్థికపరమైన డిమాండ్లు( Demands ) ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

 Negotiations Between Anganwadi Union Associations And The State Government Faile-TeluguStop.com

అయితే ఇప్పటికే కొన్ని డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిందని మరికొన్ని సమస్యలను పెండింగ్ లో ఉన్నాయని అంగన్ వాడీ వర్కర్ల సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి.ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మంత్రివర్గం ఉప సంఘంతో అంగన్ వాడీ సంఘాలు చర్చలు జరిపాయి.

రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

జీతాల పెంపు సాధ్యం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ.( Botsa Satyanarayana ) అధికారులు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ…మాది మహిళా పక్షపాత ప్రభుత్వం.

వేతనాల పెంపునకు కొంత సమయం కావాలని అడిగాం.సంక్రాంతి తర్వాత దీనిపై మరోసారి చర్చిస్తామని చెప్పాం.

పలు డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చాం.గర్భిణీలు బాలింతల ఇబ్బందుల దృష్ట్యా.

సమ్మె విరమించాలి అని స్పష్టం చేశారు.దీంతో తదుపరి కార్యాచరణ పై యూనియన్ నేతలు( Union Leaders ) సమాలోచనలు చేస్తున్నారు.ఇప్పటికే పలుమార్లు అంగన్ వాడీ లతో.రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడం జరిగింది.ఆ సమయంలో చర్చలు విఫలం కావడంతో డిసెంబర్ 31వ తారీకు తర్వాత సమ్మె మరింతగా ఉద్రిక్తం చేస్తామని యూనియన్ సంఘాలు హెచ్చరించాయి.అయితే ఇప్పుడు మరోసారి చర్చలు విఫలం కావడంతో.

అంగన్ వాడీ సంఘాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube