మంచు మనోజ్ దంపతులకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.మనోజ్ త్వరలో తండ్రి కాబోతున్నట్టు కొన్నిరోజుల క్రితం చేసిన ప్రకటన అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
అయితే మనోజ్ దంపతులు ఒక బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.నమస్తే వరల్డ్( Namasthe world cartoon store ) పేరుతో మనోజ్ దంపతులు ఒక బొమ్మల షాపును మొదలుపెట్టారు.
ప్రసాద్ ఐమాక్స్ లో మనోజ్ దంపతులు ఈ షాపును ప్రారంభించారని తెలుస్తోంది.
క్రిస్మస్ సందర్భంగా శుభవార్త చెబుతామని చెప్పిన మనోజ్ దంపతులు తాజాగా ఈ విషయాలను వెల్లడించారు.నమస్తే వరల్డ్ లో విక్రయించే బొమ్మలు మన దేశంలో తయారు చేసిన బొమ్మలు కావడం గమనార్హం.మనోజ్ ఈ కొత్త బిజినెస్ గురించి మాట్లాడుతూ మన దేశంలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయని పురాణ కథలను ఆధారంగా చేసుకుని అందులోని గొప్ప పాత్రల చుట్టూ కథలు రాశామని మనోజ్ పేర్కొన్నారు.
రాసే క్రమంలో మొదటి లాక్ డౌన్ వచ్చిందని ఆ సమయంలో ఏం చేయాలో తెలియక బొమ్మలు గీయడం మొదలుపెట్టానని మనోజ్ చెప్పుకొచ్చారు.అది ఇలా ఉపయోగపడిందని మౌనిక( Mounika ) కృషి వల్లే బొమ్మలు తయారు చేశామని ఆయన అన్నారు.దేశం నలుమూలలా ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ముడిసరుకు తెచ్చి ఈ బొమ్మలను తయారు చేశామని మనోజ్ కామెంట్లు చేశారు.ఇది పూర్తిగా మేడిన్ ఇండియా అని ఆయన అన్నారు.
సినిమాల్లోని క్యారెక్టర్లను వీడియో గేమ్స్( Video games ) గా, కార్టూన్స్ గా బొమ్మలుగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామని మనోజ్ కామెంట్లు చేశారు.ఇంటినే ఆఫీస్ గా మార్చుకుని నాలుగున్నర సంవత్సరాలుగా రీక్రెట్ గా కష్టపడుతున్నామని మనోజ్ వెల్లడించారు.
మనోజ్ దంపతులు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మనోజ్ దంపతులను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.