Allu Arjun: అల్లు అర్జున్ కోసం పెరిగిపోతున్న దర్శకుల వెయిటింగ్ లిస్ట్ !

పుష్ప సినిమా సక్సెస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ కి( Allu Arjun ) డిమాండ్ బాగా పెరిగిపోయింది.ఇప్పుడు పుష్ప 2( Pushpa 2 ) సినిమా షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నాడు.

 Allu Arjun Directors Waiting List-TeluguStop.com

అయినా కూడా ఎప్పుడు పుష్ప 2 సినిమా బయటకు వస్తుందా మరో సినిమా పట్టాలెక్కిస్తారా అని అల్లు అర్జున్ అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్స్ వెయిటింగ్ లిస్ట్ దారుణంగా పెరిగిపోతుంది.

మరి మొట్టమొదట అల్లు అర్జున్ ఏ సినిమా చేయబోతున్నాడు ? పుష్ప తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న దర్శకులు ఎవరు? ఆ సినిమా వివరాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Allu Arjun, Alluarjun, Atlee, Koratala Siva, Pushpa, Sandeepreddy, Venu S

పుష్ప సీక్వెల్ పూర్తవగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో( Trivikram Srinivas ) ఒక ప్రాజెక్ట్ చేస్తారని ఎప్పటి నుంచో ఒక టాక్ నడుస్తోంది.త్రివిక్రమ్ చెప్పిన లైన్ అల్లు అర్జున్ కి బాగా నచ్చడంతో తర్వాత సినిమా అదే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.ఇక సందీప్ రెడ్డి వంగా తో( Sandeep Reddy Vanga ) సైతం మరొక సినిమాలో నటించేందుకు బన్నీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇప్పటికే బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.వీరిద్దరు మాత్రమే కాకుండా కొరటాల శివ, వేణు శ్రీరామ్ చెప్పిన కథలకు కూడా బన్నీ ఓకే చెప్పాడట.

వీరు మాత్రమే కాకుండా తెలుగులో అల్లు అర్జున్ కోసం కథ రాస్తున్న దర్శకులు బాగానే ఉన్నారు.ఆయన అపాయింట్మెంట్ దొరక్క ఇప్పటికీ కొంతమంది లైన్లో వెయిట్ చేస్తున్నారు.

Telugu Allu Arjun, Alluarjun, Atlee, Koratala Siva, Pushpa, Sandeepreddy, Venu S

ఇవన్నీ పక్కన పెడితే షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమాతో విజయం సాధించిన అట్లీ ( Atlee ) సైతం అల్లు అర్జున్ కి ఒక కథ చెప్పి ఒప్పించాడట.జవాన్ ఇచ్చిన కిక్కు తో అట్లీ మరో సినిమా చేస్తే అల్లు అర్జున్ తో మాత్రమే చేయాలని అనుకుంటున్నారట.అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తయ్యేంత వరకు వేరే దర్శకులకు అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు అల్లు అర్జున్.ఇప్పుడు నడుస్తున్న పుష్ప అయిపోవాలి ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా అయిపోయిన తర్వాతే అట్లీ లేదా సందీప్ రెడ్డి వంగా లైన్ లోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే ఏ దర్శకుడి సినిమా ముందు సినిమా పట్టాలెక్కుతుంది లైనప్ మారే అవకాశాలు ఉన్నాయా అనేది కొద్దిరోజులు ఆగితే గాని తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube