అక్టోబర్ 7 దాడుల తర్వాత ఉగ్రవాద సంస్థ హమాస్‌పై ఇజ్రాయెల్( Israel ) భీకరదాడులకు దిగిన సంగతి తెలిసిందే.నింగీ, నేల, ఆకాశాల నుంచి విరుచుకుపడుతోంది.
ఈ యుద్ధంలో ఉగ్రవాదులతో పాటు సామాన్య ప్రజానీకం సైతం ప్రాణాలు కోల్పోతున్నారు.ఇజ్రాయెల్ తీరును నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పాలస్తీనా మద్ధతుదారులు( Palestine Supporters ) నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
రోజులు గడిచేకొద్దీ యుద్ధం తీవ్రతరమవుతోందే తప్పించి పరిష్కారం మాత్రం దొరకడం లేదు.హమాస్‌ను కూకటివేళ్లతో పెకిలించేవరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.
ఇక యుద్దం ప్రభావం క్రిస్మస్ వేడుకలపైనా( Christmas Celebrations ) పడింది.అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగరంలో క్రిస్మస్ రోజు రాత్రి పాలస్తీనా మద్ధతుదారులు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి.

క్రిస్మస్‌ను ఇక్కడ రద్దు చేశాం అంటూ నినాదాలు చేస్తూ వందలాది మంది నిరసనకారులు న్యూయార్క్( New York ) వీధుల్లోకి దూసుకొచ్చారు.క్రిస్మస్ వేడుకలు జరుగుతున్న వేదికలపై రక్తం లాంటి రంగును విసిరారు.500 మందికిపైగా నిరసనకారులు ‘‘లాంగ్ లైవ్ ది ఇంటిఫాడా’’ అని కేకలు వేస్తూ.రాక్‌ఫెల్లర్ సెంటర్ క్రిస్మస్ ట్రీని( Rockefeller Center Christmas Tree ) చుట్టుముట్టారు.
క్రిస్మస్‌పై యుద్ధం అంటూ రోజంతా పలు నిరసన కార్యక్రమాలు జరగ్గా.అవి రాత్రికి హింసాత్మకంగా రూపుదిద్దుకున్నాయి.

సెయింట్ పాట్రిక్స్ కేథడ్రల్( St.Patrick’s Cathedral ) వెలుపల ఘర్షణలు జరగడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.నిరసనలను ఎదుర్కోవడానికి లెవల్ త్రీ పోలీస్ బలగాలను అక్కడ మొహరించినట్లు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్( New York Police Department ) ధృవీకరించినట్లు డైలీ మెయిల్ వార్తా సంస్థ నివేదించింది.ఈ ఘటనలకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిరసనకారులు యూనియన్ స్క్వేర్ హాలిడే మార్కెట్ వెలుపలి భాగంలో జియోనిజం ఈజ్ టెర్రరిజం , ఫ్రీ పాలస్తీనా స్టిక్కర్లు, మర్డర్డ్ బై ఇజ్రాయెల్ , నెతన్యాహూ యుద్ధపిపాసి, ఇజ్రాయెల్ శత్రువులను చంపుతుంది అనే ఫ్లకార్డులు ఆ ప్రాంతంలో ప్రదర్శించారు.







