టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram gopal varma )గురించి మనందరికీ తెలిసిందే.ఆయన ఏది మాట్లాడినా ఏం చేసినా కూడా సంచలనమే అవుతూ ఉంటుంది.
ఇకపోతే వర్మ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా వ్యూహం.ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం వ్యూహం.
ఈ సినిమాలో జగన్‌ను హీరోగా చూపిస్తున్న వర్మ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విలన్లుగా చూపిస్తూ వ్యూహం తెరకెక్కించారు.

అదే ఇప్పుడు టీడీపీ, జనసేన ( TDP, Jana Sena )కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తోంది.అందుకే, వర్మపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.తాజాగా హైదరాబాద్‌లోని రాంగోపాల్ వర్మ కార్యాలయం ఎదుట టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
కార్యాలయంలోకి వెళ్లి గొడవ చేశారు.ఆర్జీవీ ఆఫీసు ఎదుట ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టారు.
వ్యూహం సినిమాను బ్యాన్ చేయాలని నినాదాలు చేస్తూ ఆ సినిమా పోస్టర్ లను కూడా తగలబెట్టారు.దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.అయితే, ఈ ఆందోళనపై రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు.

చంద్రబాబు నాయుడు, నారా లోకేష్,( Chandrababu Naidu ) పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేసి మరీ ట్విట్టర్ లో ఈ విధంగా రాసుకొచ్చారు.హేయ్ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్.నా ఆఫీసు బయట మీ కుక్కలు మొరుగుతున్నాయి.పోలీసులు రాగానే వాళ్లు పారిపోయారు అని కాస్త ఘాటుగా పోస్ట్‌లో రాసారు వర్మ.ఈ పోస్ట్‌కు టీడీపీ, జనసేన కార్యకర్తలు ఘాటుగా స్పందిస్తున్నారు.వర్మను తిట్టిపోస్తున్నారు.







