తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేయాలని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు.బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ చేయకూడదని తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని బండి సంజయ్ ఆరోపించారు.ఈ క్రమంలోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని పేర్కొన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ అహంకారంతోనే బీఆర్ఎస్ ఖతం అవుతుందని విమర్శించారు.బీఆర్ఎస్ స్వేదపత్రం అబద్దాల మూటని బండి సంజయ్ విమర్శించారు.