టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే ప్రభాస్ తాజాగా నటించిన సలార్ ( Salaar )సినిమా డిసెంబర్ 22న విడుదల అయ్యి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రాణిస్తోంది.
అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.ఇక ఎట్టకేలకు ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ అవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.
ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

చాలాకాలం తర్వాత ప్రభాస్( Prabhas ) కెరియర్ లో అనుకున్న విధంగా సినిమా సక్సెస్ కావడంతో డార్లింగ్ అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.అలాగే పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర కూడా సలార్ ప్రభంజనం సృష్టిస్తోంది.ముఖ్యంగా నార్త్ అమెరికా( North America )లో సలార్ ఓపెనింగ్ వీకెండ్‌లో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది.
ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఉత్తర అమెరికాలో సలార్ 5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది.దీంతో అమెరికా, కెనడాలో మూడుసార్లు 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరోగా ప్రభాస్ రికార్డ్ సృష్టించాడు.
బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు అంతకు ముందు ఈ రికార్డ్ సృష్టించాయి.

ఇక ఓవరాల్‌గా బాహుబలి సిరీస్‌తో పాటు ఆర్ఆర్ఆర్ మాత్రమే ఈ అరుదైన రికార్డ్ అందుకుంది.తాజాగా 5 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ఎంటరైన నాలుగో చిత్రంగా సలార్ నిలిచింది.మరోవైపు ప్రభాస్ మేనియా సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ బెల్ట్‌లో కూడా గట్టిగానే పని చేస్తుంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 2 రోజుల్లోనే దాదాపు 300 కోట్ల రూపాయలను వసూలు చేసింది.ఈ లెక్కలు చూసి ఇండస్ట్రీ వర్గాలే అవాక్కవుతున్నాయి.
ప్రభాస్ స్టామినా చూసి బాలీవుడ్ మరోసారి షేక్ అయింది.బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంత ప్రభావం చూపించలేకపోయాయి.
దీంతో ప్రభాస్ పని అయిపోయిందంటూ చాలా మంది ట్రోల్ చేశారు.కానీ సలార్ సినిమాతో వాళ్లందరికీ తన విశ్వరూపం చూపించాడు ప్రభాస్.
తన కటౌట్‌కి సరైన సినిమా పడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించాడు.ప్రభాస్ క్రేజ్‌కి, స్టామినాకి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ స్టైల్, టేకింగ్ తోడై సలార్‌ను ఎక్కడో నిల్చోబెట్టింది.