వికారాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది.శివారెడ్డిపేట చెరువులోకి కారు దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఒకరు గల్లంతయ్యారని తెలుస్తోంది.
ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉన్నారు.
వీరిలో నలుగురు ప్రాణాలతో బయట పడగా ఒక వ్యక్తి గల్లంతయ్యాడు.అలాగే బయటకు వచ్చిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఈ క్రమంలోనే గల్లంతైన వ్యక్తి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
అయితే దట్టమైన పొగమంచు కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.