దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కమ్మేసింది.పొగమంచు దట్టంగా అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాలను దారి మళ్లిస్తున్నారు.పొగమంచు కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రత సుమారు 9.4 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది.చలి తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజలు బయటకు రావాలంటేనే బయపడే పరిస్థితులు నెలకొన్నాయి.







