ఈ ఏడాది పూర్తి కాబోతుంది.మరి ఏడాది పూర్తి అయ్యేలోపు డార్లింగ్ నుండి మరో సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
ఆదిపురుష్ వంటి ప్లాప్ తర్వాత మళ్ళీ ప్రభాస్ నుండి మరో సినిమా రావడం అది కూడా ఎట్టకేలకు డార్లింగ్ కు హిట్ ఇవ్వడం ఫ్యాన్స్ కు అమితానందం ఇస్తుంది.పాన్ ఇండియన్ వ్యాప్తంగా మోస్ట్ ఏవైటెడ్ మూవీగా ఉన్న ”సలార్” నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ”సలార్”( Salaar ).

క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది.దాదాపు ఆరేళ్ళ ఫ్యాన్స్ నిరీక్షణ తర్వాత ప్రభాస్ కు హిట్ అనేది పడింది.దీంతో ఫ్యాన్స్ హంగామా మాములుగా చేయడం లేదు.ఇక ఓపెనింగ్స్ తోనే రికార్డ్ బ్రేక్ చేసాడు ప్రభాస్.ఈ సినిమా లేటెస్ట్ గా మాస్ ప్రాంతం అయినా సీడెడ్ లో మరింత ప్రభంజనం సృష్టిస్తుంది.

రెండు రోజుల్లోనే ఈ సినిమా 9.5 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసింది.మరి వీకెండ్ ప్లస్ క్రిస్మస్ హాలిడేతో మరింత రాబట్టే అవకాశం కనిపిస్తుంది.
కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటించగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మించారు.
అలాగే రవి బసృర్ సంగీతం అందించారు.







