బీజేపీ లేటైనా లేటెస్ట్ గా వస్తుంది..: ఎంపీ జీవీఎల్

ఏపీలో పొత్తులపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు క్లారిటీ ఇచ్చారు.పొత్తులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

 Bjp Will Be The Latest Even If It Is Late..: Mp Gvl-TeluguStop.com

ఎన్నికల సమయంలో పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్న ఎంపీ జీవీఎల్ బీజేపీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తుందని వ్యాఖ్యానించారు.ఈ క్రమంలో అధికార పార్టీ తమపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ను ఎందుకు కలిశారో వారే చెప్పాలన్నారు.అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్ లో తాను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే స్టీల్ ప్లాంట్ ను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు.అందుకు అనుగుణంగానే ఒప్పందాలు జరుగుతున్నాయని జీవీఎల్ వెల్లడించారు.

అయితే ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలకు ప్లాంట్ అమ్మకానికి సంబంధం లేదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube