ఆ సమయంలో ఉపాసన నా కూతురని చెప్పిన కృష్ణంరాజు.. అంత ప్రేమగా చూసుకున్నారంటూ?

రామ్ చరణ్( Ram Charan ) భార్య ఉపాసన కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలైనా రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.ఉపాసన( upasana ) మంచి మనస్సు గురించి ఇప్పటికే ఎన్నో కథనాలు ప్రచారంలోకి రాగా ఇతరులకు సహాయం చేసే విషయంలో ఉపాసనకు ఎవరూ సాటిరారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

 Krishnam Raju Comments About Upasana Details Here Goes Viral In Social Media , S-TeluguStop.com

సేవా కార్యక్రమాలను నిర్వహించే విషయంలో సైతం ఉపాసన ముందు వరసలో ఉంటారు.

అయితే కృష్ణంరాజు( Krishnam Raju ) మరణించడానికి ముందు కాలికి గాయమైన సమయంలో ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు.

అపోలో ఆస్పత్రి ఉపాసన సొంత ఆస్పత్రి కాగా ఉపాసన కృష్ణంరాజు ఆరోగ్యం విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారట.ఆ సమయంలో ఉపాసన నా కూతురని కన్న కూతురిలా ఎంతో ప్రేమగా చూసుకున్నారని కృష్ణంరాజు చెప్పారట.

కృష్ణంరాజు గతంలో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కృష్ణంరాజు కుటుంబానికి, చిరంజీవి కుటుంబానికి మధ్య మంచి అనుబంధం ఉంది.కృష్ణంరాజు భార్య శ్యామలాదేవికి( Shyamaladevi ) ప్రభాస్ తర్వాత ఇష్టమైన హీరో చరణ్ కావడం గమనార్హం.ప్రభాస్ సినిమాలతో పాటు చరణ్ సినిమాలను సైతం ఆమె ఇష్టంగా చుస్తారని తెలుస్తోంది.

ప్రభాస్ సలార్ తో 2023 సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకోవడం జరిగింది.

ప్రభాస్ తర్వాత సినిమాలు సైతం ఒకింత భారీ బడ్జెట్ తో భారీ లెవెల్ లో తెరకెక్కుతున్నాయి.సలార్2, ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్, స్పిరిట్ సినిమాలతో కెరీర్ ను ప్రభాస్ వేరే లెవెల్ లో ప్లాన్ చేసుకున్నారు.ఈ సినిమాలన్నీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తాయని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.

ప్రభాస్, చరణ్ పారితోషికాలు భారీ రేంజ్ లో ఉండగా ఈ హీరోల తర్వాత సినిమాలు సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube