షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప... విష్ణు స్పీడ్ మామూలుగా లేదుగా?

మంచు విష్ణు( Manchu Vishnu ) డ్రీం ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప ( Kanappa )సినిమా న్యూజిలాండ్ లోనే ఓకే షెడ్యూల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం భావించిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే గత మూడు నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించింది.

 Mohan Babu Gives Big Update To Kannappa Movie, Kannappa, Mohan Babu, Vishnu, Tol-TeluguStop.com

ఇలా 90 రోజులపాటు విరామం లేకుండా సినిమా షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తుంది.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు ప్రభాస్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వండి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Telugu Hollywood, Kannappa, Mohan Babu, Mohanlal, Prabhas, Shivraj Kumar, Tollyw

ఇక ఈ సినిమా షూటింగ్ ఒకే షెడ్యూల్లో పూర్తి చేయాలని సినిమా షూటింగ్ కి అవసరమైనటువంటి వాటికి ప్రత్యేకంగా తమిళనాడులో తయారు చేయించి దాదాపు నాలుగు కంటైనర్ల ద్వారా న్యూజిలాండ్ తరలించారు.ఇక 90 రోజులపాటు ఏమాత్రం విరామం లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో మోహన్ బాబు( Mohan Babu) సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

Telugu Hollywood, Kannappa, Mohan Babu, Mohanlal, Prabhas, Shivraj Kumar, Tollyw

న్యూజీలాండ్‌లో 600 మంది హాలీవుడ్, భారతదేశంలోని అతిరథ మహారథులైన నటీనటులతో.థాయిలాండ్, న్యూజీలాండ్ సాంకేతిక నిపుణులతో.విష్ణు మంచు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం కన్నప్ప.

  90 రోజుల షెడ్యూల్ చిత్రీకరణ దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగి ఇండియాకు వస్తున్నామని ఈయన తెలియజేశారు.ఆ  పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందని మోహన్ బాబు తెలిపారు.

ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్లోని షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నారనే విషయం తెలియడంతో కనప్ప సినిమా విషయంలో విష్ణు( Vishnu ) చాలా స్పీడ్ గా ఉన్నారని తెలుస్తుంది.ఇక త్వరలోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube