అన్యాయం జరిగినప్పుడు విజిల్ వెయ్యాలి.. అసెంబ్లీ విజిల్ ఘటనపై హరీష్ శంకర్ కామెంట్స్?

నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) హీరోగా వెండితెరపై మెప్పించారు.అయితే వ్యాఖ్యాతగా కూడా ఈయన ఆహాలో ప్రసారమవుతున్నటువంటి అన్ స్టాపబుల్ ( Un Stoppable ) కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 Director Harish Shankar Indirectly Comments On Balakrishna Assembly Whistle , Ha-TeluguStop.com

ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకొని మూడవ సీజన్ కూడా మూడు ఎపిసోడ్లు ప్రసారం అయింది ఇటీవల 3వ ఎపిసోడ్లో భాగంగా సుహాసిని శ్రేయ హరీష్ శంకర్ వంటి తదితరులు పాల్గొని సందడి చేశారు.ఇక ఈ ఎపిసోడ్లో భాగంగా హరీష్ శంకర్ బాలయ్య అసెంబ్లీలో వేసినటువంటి విజిల్ సంఘటనను గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఒక గేమ్ నిర్వహించారు ఇందులో ఒక హీరో వాయిస్ వినపడుతుంది అయితే ఆ హీరో వాయిస్ ఎవరిది అనేది తెలియజేయాల్సి ఉంటుంది అయితే ఈ ఆన్సర్ చెప్పేవారు ముందుగా విజిల్ వేసి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే ప్రభాస్ వాయిస్ వినిపించగా హరీష్ శంకర్ ( Harish Shankar )విజిల్ వేయకుండానే ప్రభాస్ అంటూ సమాధానం చెబుతారు అయితే ఈయన సరైన సమాధానం చెప్పినప్పటికీ బాలయ్య మాత్రం తనని విన్నర్ గా ప్రకటించారు.

ఈ క్రమంలోనే హరీష్ శంకర్ మాట్లాడుతూ.అన్యాయం జరిగినప్పుడు విజిల్ వెయ్యాలి అనేది మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అంటూ అసెంబ్లీలో బాలకృష్ణ విజిల్( Whistle ) వేసినటువంటి సంఘటనను గుర్తు చేశారు.చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో బాలకృష్ణ అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాలలో భాగంగా ఒక్కసారిగా విజిల్స్ వేయడంతో అప్పట్లో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.అయితే తాజాగా మరోసారి హరీష్ శంకర్ అసెంబ్లీ సంఘటనను గుర్తు చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube