చాలా రోజులుగా ఫ్లిప్‌కార్ట్ సర్వీస్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ఆర్డర్ డెలివరీ విషయంలో ఇంకా కస్టమర్ బిహేవియర్ విషయంలో ఫ్లిప్‌కార్ట్ యూజర్లను సంతృప్తి పరచలేకపోతోంది.
తాజాగా డెయిటీ ( @gharkakabutar ) అనే సోషల్ మీడియా యూజర్ ఈ-కామర్స్ కంపెనీ అయిన ఫ్లిప్‌కార్ట్‌తో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.డెలివరీ ఎగ్జిక్యూటివ్ తన తండ్రితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆగ్రహం వెళ్ళగక్కింది.
తర్వాత తాను మళ్లీ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ చేయనని చెప్పింది.
తన తండ్రి ఫ్లిప్‌కార్ట్ నుంచి ఏదో ఆర్డర్ చేశారని, డెలివరీని నిర్ధారించడానికి డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో వన్-టైమ్ పాస్‌వర్డ్ ( OTP )ని షేర్ చేయాల్సి ఉందని ఆమె వివరించింది.
ఓటీపీ అనేది 4-అంకెల కోడ్, ఇది ప్యాకేజీని తప్పు వ్యక్తికి డెలివరీ చేయకుండా నిరోధించడానికి కస్టమర్ ఫోన్‌కు పంపడం జరుగుతుంది.అయితే, ఆమె తండ్రి ఫోన్‌లో ఓటీపీ కనిపించకపోవడంతో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు కోపం వచ్చింది.
అతను చెప్పాడు, “‘కుచ్ ఆతా నహీ హై తో ఆర్డర్ క్యున్ కర్తే హో!’( Kuch ata nahi hai to order kyun karte ho ) అంటే “మీకు ఏమీ చేయాలో తెలియకపోతే వస్తువులను ఎందుకు ఆర్డర్ చేయాలి!” అని నోరు పారేసుకున్నాడు.

ఈ సంఘటన గురించి దేవీ రీసెంట్‌గా ఎక్స్‌లో పోస్ట్ చేసి, ఫ్లిప్‌కార్ట్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఆమె “ఇంకెప్పుడూ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఏమీ ఆర్డర్ చేయవద్దు.మీరు కస్టమర్‌లతో ఈ విధంగా మాట్లాడవద్దు.” అని తిట్టిపోసింది.ఆమె పోస్ట్ ఫ్లిప్‌కార్ట్ దృష్టిని ఆకర్షించింది, ఆమెకు రిప్లై ఇచ్చింది.
డెలివరీ ఎగ్జిక్యూటివ్ ప్రవర్తనకు క్షమాపణలు చెప్పింది.ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ ఇన్ఫో రక్షించుకోవడానికి, సమస్యను పరిష్కరించడానికి డైరెక్ట్ మెసేజ్ ( DM ) ద్వారా ఆర్డర్ వివరాలను పంచుకోవాలని వారు ఆమెను ఫ్లిప్‌కార్ట్ కోరింది.

ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పేలవమైన కస్టమర్ సేవను అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌ను విమర్శించారు.వృద్ధుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదని, ఫ్లిప్‌కార్ట్ తరచుగా కస్టమర్లను మోసం చేస్తుందని, ఫేక్ ప్రొడక్ట్స్ డెలివరీ చేసినా డబ్బును రిఫండ్ చేయడం అలవాటు లేదని చురకలు అంటించారు.వారు ఫ్లిప్‌కార్ట్‌కు బదులుగా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి కొనుగోలు చేయడానికి ఇష్టపడతారని చెప్పారు.ఫ్లిప్‌కార్ట్ యూజర్ పోస్ట్‌కు 70 వేల దాక వ్యూస్, వందల కొద్దీ కామెంట్లు వచ్చాయి.







