ఈ ఏడాది ప్రారంభం లో ‘పఠాన్’ చిత్రం తో ఒకసారి, సెప్టెంబర్ లో ‘జవాన్’ చిత్రం తో మరోసారి, ఇలా వరుసగా రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఏకైక హీరో గా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) నిలిచాడు.అలా పీక్ ఫామ్ లో ఉన్న షారుఖ్ ఖాన్, అపజయం అనేదే ఎగురని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం లో నటించిన ‘డుంకీ’ చిత్రం( Dunki Movie ) రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.
షారుఖ్ ఖాన్ మిగిలిన రెండు సినిమాలు లాగ కాకుండా, కాస్త స్మూత్ జానర్ సినిమా అవ్వడం తో ‘డుంకీ’ చిత్రానికి పెద్దగా ఓపెనింగ్స్ రాలేదు కానీ, లాంగ్ రన్ లో మాత్రం సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి.మొదటి రెండు రోజులకంటే కూడా మూడవ రోజు ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి.
ఇదంతా పక్కన పెడితే ‘డుంకీ’ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరానీ( Rajkumar Hirani ) తెలుగు మరియు హిందీ భాషల్లో బై లింగ్యువల్ చిత్రం గా తెరకెక్కించాలని ముందుగా అనుకున్నాడట.బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, అలాగే తెలుగు లో రామ్ చరణ్ తో( Ram Charan ) ఈ సినిమాని తియ్యాలని అనుకున్నాడు.
కానీ ఇలాంటి సినిమాలు మన దగ్గర ఆడవు అని రామ్ చరణ్ కి ఒక క్లారిటీ ఉంది.అందుకే ఈ చిత్రాన్ని సున్నితంగా తిరస్కరించాడు రామ్ చరణ్.
ఈ సినిమా ఒప్పుకొని చేసి ఉంటే సినిమా ఫలితం తో సంబంధం లేకుండా రామ్ చరణ్ కి మంచి పేరు వచ్చేదేమో కానీ, ఇప్పుడు ఉన్న కమర్షియల్ పోటీ యుగం లో మాత్రం వెనకబడేవాడు.అయితే ఈ సినిమా కాకపోయినా, త్వరలోనే రామ్ చరణ్ రాజ్ కుమార్ హిరానీ తో ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడట.‘గేమ్ చేంజర్’( Game Changer ) మరియు బుచ్చి బాబు సినిమాల తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది.
రామ్ చరణ్ తో రాజ్ కుమార్ హిరానీ ‘3 ఇడియట్స్’ లాంటి యూత్ ఫుల్ మూవీ ని తియ్యడానికి ప్లాన్ చేస్తున్నాడట.#RRR చిత్రం తో రామ్ చరణ్ రేంజ్ పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ కి ఎగబాకిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఆయన రేంజ్ కి తగ్గట్టే ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి.
ఈ సినిమాకి సంబంధించిన ఫోటో షూట్ ని కూడా చాలా రోజుల క్రితమే చేశారట.వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజున ఈ పోస్టర్స్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.