సినిమాల్లో హీరోలుగా నటించే వారికి జనాల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హీరోలే తమ దేవుళ్ళుగా భావించే వీరాభిమానులు లక్షల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
అలాంటి హీరోలు( Heros ) తమకు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చూసి మురిసిపోతుంటారు.నిజానికి హీరోలు సినిమాల్లోనే కాకుండా బయట కూడా దాతృత్వ పనులు చేస్తూ బాగా పేరు తెచ్చుకుంటుంటారు.
అందువల్ల హీరోలు అంటే అభిమానంలో ఒక స్పెషల్ గౌరవం ఉంటుంది.ఆ ఇమేజ్ చూసుకొని రాజకీయాల్లోకి( Politics ) వచ్చి మరింత సేవా కార్యక్రమాలు చేయాలని, ప్రజల జీవితాలను బాగు చేయాలని హీరోలు అనుకుంటారు.
కానీ తాను ఒకటి తెలిస్తే మరొకటి తలచినట్లుగా హీరోగా ఉన్నప్పుడు ఆదరించిన అభిమానులే రాజకీయ వేత్తగా మారినప్పుడు ఓట్లు వేయకుండా పోట్లు పొడుస్తుంటారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) విషయంలో ఇదే జరిగింది.అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) విషయంలోనూ సేమ్ రిపీట్ అయింది.
ఓటర్ల నాడిని పట్టుకోవడం ఇప్పట్లో ఏ హీరో తరం కావడం లేదు.ఒకప్పుడు రాజకీయ నేత అంటే ఒక విలన్ లాగా ప్రజలను శాసించేవాడు.
అక్రమాలు, దోపిడీలకు పాల్పడుతూ ప్రజలను నానా తిప్పలు పెట్టేవాడు.వారిని విలన్ గా భావించి సినిమాల్లో హీరోలుగా చేసే వారిని రియల్ హీరోలు గానే అప్పటి ప్రజలు భావించేవారు.
ఈ హీరోలు తమ కోసం ఏదైనా చేస్తారేమో అని ఓట్లు వేసి గెలిపించేవారు.

ఉదాహరణకు నందమూరి తారక రామారావును( Nandamuri Taraka Ramarao ) ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సీఎంను చేశారు.తర్వాత ఆయన ఓడిపోయారు.మళ్లీ ఓటర్ల నాడి పట్టుకుని గెలుపొందారు.
ఇక తమిళనాడులో ఎంజీఆర్( MGR ) సీఎం అయ్యారు తర్వాత జయలలిత( Jayalalitha ) కూడా సీఎం అయ్యారు.వీరి తర్వాత ముఖ్యమంత్రి హోదా తెచ్చుకున్న నటులు దాదాపు శూన్యం అని చెప్పుకోవచ్చు.
దానికి కారణం ఓటరు సినీ నటులకు ఓట్లు వేయకపోవడమే అని చెప్పుకోవచ్చు.ధనం మూలం ఇదం జగత్ అన్నట్లు ఈరోజుల్లో ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికే చాలామంది ఓట్లు వేస్తున్నారు.
ఈ పంచుడి కార్యక్రమాలు హీరోల వల్ల కాకపోవడం వల్ల ఓడిపోతున్నారు.అంతేకాకుండా వారిని నమ్మడం లేదు.
స్వార్థ రాజకీయాల కోసమే ఈ రోజుల్లో హీరోలు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని వారు నమ్ముతున్నారు.

నిజానికి పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు భారీ మెజారిటీతో గెలుస్తాడని అందరూ అనుకున్నారు.కానీ అతడు ఓడిపోయాడు.అంటే ఓటర్లు ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ ని ప్రేమిస్తాం కానీ జగనన్నకే ఓటు వేస్తామని ఫ్లెక్సీలు పెట్టిన అభిమానులు కూడా ఉన్నారంటే సినిమా నటులను ఓటర్లు ఎలా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.చిరంజీవి, పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది రాజకీయాల్లో ఫెయిల్ అయిన తర్వాత కొత్తగా ఏ హీరో కూడా పాలిటిక్స్ వైపు రావడానికి ధైర్యం చేయడం లేదు.
తమిళంలో హీరో విజయ్ పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి మరి అతడి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.







