విజయవాడలోని ( Vijayawada ) కేంద్ర ఎన్నికల ప్రతినిధులను వైసీపీ, టీడీపీ నేతలు కలిశారు.ఏపీలో ఓట్ల నమోదులో అవకతవకలపై ఈసీ( Election Commission ) బృందానికి ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను వైసీపీ తరపున పేర్ని నాని,( Perni Nani ) జోగి రమేశ్( Jogi Ramesh ) కలిశారు.
అటు టీడీపీ తరపున బోండా ఉమ, వర్ల రామయ్య తో పాటు జనసేన తరపున వెంకటేశ్వర్లు, బోనబోయిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల నమోదులో అక్రమాలు జరిగాయని నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.టీడీపీ( TDP ) దొంగ ఓట్లను క్రియేట్ చేస్తుందని వైసీపీ( YCP ) ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం పర్యటన కొనసాగుతోంది.







