ప్రియుడితో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియాంక జైన్.. చేతుల్లో ఏం లేదంటూ?

బిగ్ బాస్ షో సీజన్7 లో( Bigg Boss 7 ) టాప్4 కంటెస్టెంట్లలో ప్రియాంక జైన్( Priyanka Jain ) ఒకరిగా నిలిచారు.బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ ను మరింత పెంచుకున్న ప్రియాంక తాజాగా ఒక సందర్భంలో పెళ్లి గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Priyanka Jain Comments About Marriage Goes Viral In Social Media Details, Priyan-TeluguStop.com

శివకుమార్ అనే వ్యక్తితో ప్రియాంక జైన్ ప్రేమలో ఉందనే సంగతి తెలిసిందే.ఆన్ లైన్ లో అభిమానులతో ముచ్చటించిన ప్రియాంక జైన్ నా పెళ్లి ఎప్పుడనే ప్రశ్నను శివ కుమార్ నే అడగాలని ఆమె అన్నారు.

శివకుమార్ ఎప్పుడు పెళ్లంటే అప్పుడు పెళ్లి( Marriage ) చేసుకుంటానని ప్రియాంక జైన్ కామెంట్లు చేశారు.ప్రస్తుతం శివకుమార్( Shiva Kumar ) షూటింగ్స్ తో బిజీగా ఉన్నారని ఆమె కామెంట్లు చేశారు.

పెళ్లి గురించి తన చేతుల్లో ఏం లేదని ప్రియాంక జైన్ చెప్పిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.ప్రియాంక జైన్ త్వరలో స్టార్ మా ఛానల్ లోని సీరియళ్లతో బిజీ అయ్యే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.

ప్రియాంక జైన్ సరిగ్గా దృష్టి పెడితే సినిమాల్లో కూడా సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉ ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ప్రియాంక జైన్ నెక్స్ట్ లెవెల్ లో కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.ప్రియాంక జైన్ బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ ను( Remuneration ) అందుకున్నారని తెలుస్తోంది.

పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) నిజంగానే భూమి బిడ్డ అని ప్రియాంక జైన్ పేర్కొన్నారు.బిగ్ బాస్ హౌస్ లో గేమ్ పరంగా మాతో మాకే గొడవలు ఉన్నాయని మళ్లీ అందరం కలిసిపోతామని ప్రియాంక జైన్ చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ షో చివరి 4 వారాలలో ప్రశాంత్ తో మంచి అనుబంధం ఏర్పడిందని ప్రియాంక జైన్ కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube