కేంద్రంలోని బీజేపీకి ఏపీ సీఎం జగన్ తో పాటు ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ భయపడుతున్నారని సీపీఐ నాయకుడు నారాయణ అన్నారు.
బీజేపీని ఎదిరించే ధైర్యం వీరికి లేదని నారాయణ విమర్శించారు.
విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు.ఏపీలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ మరియు సీపీఎం కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు.
జగన్ ను ఎదుర్కోవాలంటే అన్ని పార్టీలు కలవాలని వెల్లడించారు.అలాగే టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు.