ఉదయం లేవగానే చాలామందికి టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది.కొందరు బ్రష్ చేయకుండా, మరికొందరు బ్రష్ చేశాక ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగుతుంటారు.
దీనికి మనుషులు బాగా ఎడిక్ట్ అయిపోయారు.టీ,కాఫీ తాగడం మంచిదే కానీ పరుగుడుపున తాగడం అస్సలు మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా వేరేవి తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.అటువంటి వాటిలో ఈ జ్యూస్ కూడా ఒకటి.
ఈ జ్యూస్ ఏదో కాదు సొరకాయ జ్యూస్.ఉదయాన్నే సొరకాయ జ్యూస్ తాగడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సొరకాయ జ్యూస్(Bottle Gourd Juice ) రుచికరంగా అనిపించకపోయినప్పటికీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.తరచుగా ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్లకు తప్పక ఈ సొరకాయ జ్యూస్ ఉపయోగపడుతుంది.ఈ సొరకాయ జ్యూస్ శరీరానికి చాలా మేలు చేస్తుంది.అయితే పాల జ్యూస్ లో సహజ చక్కెర కలిగి ఉంటుంది.ఇది గ్లైకోజన్ లెవెల్స్ ను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య ఉన్నట్లయితే అలాగే నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లయితే సొరకాయ జ్యూస్ తీసుకోవడం మంచిది.
ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తీసుకోవడం వలన శరీరానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

సొరకాయ జ్యూస్ లో 98% నీరు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి శరీరం నుండి ఈ విషాన్ని బయటికి పంపిస్తాయి.అదేవిధంగా మలబద్ధకం( Constipation )తో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది.
ప్రధానంగా కిడ్నీలో రాళ్లు( Kidney Stones ), యూరినరీ ఇన్ఫెక్షన్స్, మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తరచూ ఈ జ్యూస్ తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్లు కూడా ఈ జ్యూస్ తీసుకోవడం వలన ఈ సమస్యను చెక్ పెట్టవచ్చు.
అలాగే ఈ జ్యూస్ తాగడం వలన రక్తంలో చక్కెర లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.