డిసెంబర్ 22న భారీ అంచనాల నడుమ విడుదలైన సలార్ మూవీ( Salaar Movie ) ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయలేదు.అలాగని ఖుషి కూడా చేయలేదు.
ఇది హిట్ టాక్ కూడా తెచ్చుకుంది.కానీ కేజీఎఫ్ రేంజ్ లో సెన్సేషనల్ హిట్ టాక్ అందుకోలేకపోయింది.
కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ ( Prabhas ) యాక్షన్ సీన్స్ అదరగొట్టాయి కానీ సినిమా ఆధ్యాంతం అద్భుతంగా సాగలేదు.ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో కొన్ని మైనస్‌లు ఉన్నాయి.
ముఖ్యంగా ప్రశాంత్ నీల్ మూడు బ్లెండర్స్ చేశాడు.ఆ మైనస్‌లు ఈ సినిమాలో లేకుంటే సలార్ జవాన్ మూవీ రేంజ్ లో రెస్పాన్స్ అందుకునేది.
ఇంతకీ ఏమిటా బ్లెండర్స్ అనేది తెలుసుకుందాం.
ఈ సినిమాకి ఆయువు పట్టు యాక్షన్స్ సన్నివేశాలు అని చెప్పుకోవచ్చు.
అయితే ఆ యాక్షన్ సన్నివేశాలను కొన్ని చోట్లా ఆశించిన స్థాయిలో ఎలివేట్ చేయడంలో ప్రశాంత్( Prashanth Neel ) పూర్తిగా విఫలమయ్యాడు.ప్రభాస్ ఇమేజ్ వల్లనో లేదంటే ప్రెజర్ వల్లనో అతడు ఆ సన్నివేశాలను సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు.
కొన్నిచోట్ల అనవసరంగా మరింత వైలెన్స్ సన్నివేశాలు( Violence Scenes ) జొప్పించాడు.ఇవే సినిమాకి మొదటి మిస్టేక్ అయ్యాయి.
ప్రశాంత్ కేజీఎఫ్ సినిమాలో మదర్ సెంటిమెంట్ బాగా పండించగలిగాడు.సలార్ సినిమాలో ఫ్రెండ్స్ సెంటిమెంట్( Friends Sentiment ) వాడాడు కానీ అది కేజిఎఫ్ లో లాగా ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది.ప్రేక్షకులలో అంతగా ఎమోషనల్ రెస్పాన్స్ పొందలేకపోయింది.స్టోరీలో క్లారిటీ కూడా మిస్ అయింది.ప్రభాస్, పృథ్వీరాజ్( Prithviraj Sukumaran ) ఒకరికోసం ఒకరు ఎలా మద్దతు ఇచ్చుకుంటారో కూడా ప్రశాంత్ సరిగా చెప్పలేకపోయాడు.ఈ విషయంలో కాస్త క్లారిటీ ఉన్నట్లయితే బాగుండేది.
ఇక క్యాన్సర్ స్టోరీ, వంశాల గురించి చెప్పే విషయంలో కూడా స్పష్టత లోపించింది.వీటిని ప్రశాంత్ చాలా వేగంగా చెప్పుకుంటూ పోయాడు, దీనివల్ల ఆడియన్స్ కు మెయిన్ పాయింట్ మిస్ కావడం జరిగింది.చివరాఖరికి ప్రభాస్ పాత్ర విషయంలోనూ ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్ ఏర్పడింది.మొత్తం మీద క్యారెక్టర్స్ గురించి సరిగా చూపించడంలో ప్రశాంత్ ఫెయిల్ అయ్యాడు.అది కూడా పెద్ద మిస్టేక్ అయింది.సినిమా రిలీజ్ కి ముందు ఇవన్నీ చెక్ చేసుకుని చేయాల్సిన కరెక్షన్స్ చేసి ఉంటే మూవీ ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చి ఉండేది.