ప్రభాస్, ప్రశాంత్ నీల్( Prabhas, Prashanth Neel ) కాంబో లో రూపొందిన సలార్ సినిమా నిన్న విడుదల అయింది.చాలా రోజుల క్రితమే సినిమా ను రెండు పార్ట్ లు గా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.
కేజీఎఫ్ 1 ను కథ మధ్య లో ముగించాడు.అయితే పెద్దగా సస్పెన్స్ అయితే ఏమీ లేదు.
కానీ సలార్ విషయం లో అలా కాదు.మొదటి పార్ట్ లో చెప్పిన కథ లో చాలా విషయాలను సస్పెన్స్ గా ఉంచారు.
చాలా సన్నివేశాలకు వచ్చే పార్ట్ లో సమాధానం చెప్పబోతున్నట్లుగా ప్రశ్నలను లెవనెత్తి ఉంచాడు.దాంతో ఇప్పటి నుంచే సలార్ 2 సినిమా( Salaar 2 movie ) కోసం ఆసక్తి మొదలు అయింది.

సలార్ 2 సినిమా ఎప్పుడు వస్తుందా అనే చర్చ కూడా జరుగుతోంది.సలార్ 2 కి సంబంధించిన ఏమైనా షూటింగ్ జరిగిందా… వచ్చే ఏడాది లో అంటే 2024 లో వచ్చే అవకాశం ఉందా లేదంటే 2025 వరకు వెయిట్ చేయాల్సిందేనా అనే చర్చ జరుగుతోంది.సలార్ ని మొదటి ఒక్క పార్ట్ గానే అనుకున్నారు.కానీ మధ్య లో రెండు పార్ట్ లు గా చేయడం జరిగింది.అందుకే మొదట అనుకున్న ప్రకారం రెండు పార్ట్ లకు కొంత వరకు అయినా షూటింగ్ చేసి ఉంటారు.అదే నిజం అయితే ఎక్కువ సమయం తీసుకోకుండా 2024 లో చివరి వరకు అయినా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

కానీ 2024 లో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే కష్టమేనా అనే చర్చ జరుగుతోంది.మొత్తానికి భారీ అంచనాల నడుమ రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ 1 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని, వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా అడుగులు వేస్తోంది.కనుక సలార్ 2 సినిమా కోసం ఎదురు చూపులు మొదలు అయ్యాయి.షూటింగ్ ముగిసిందా లేదా అనేది దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి క్లారిటీ వస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.