ప్రభాస్.( Prabhas ) తెలుగు నుంచి వెళ్ళిన మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్.
బాలీవుడ్ నుంచి వచ్చే పోటీని తట్టుకొని బాహుబలి సినిమా( Baahubali ) తర్వాత నిలబడాలని అనేక ప్రయత్నాలు చేసాడు.కానీ ఐదేళ్లుగా ఒక్కసారి కూడా విజయం అతడిని పలకరించలేదు.
కానీ సలార్ సినిమా అతడికి మళ్ళీ మాస్ హీరోగా చత్రపతి తర్వాత ఆ రేంజ్ కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో అద్భుతంగా నిలిచింది.ఇక నార్త్ ఇండియా విషయానికి వచ్చేసరికి సౌత్ నుంచి ఎవరైనా హీరో వస్తే బాలీవుడ్ ఎప్పటికీ ఒప్పుకోదు అనేది నిజం.
బాలీవుడ్ మాఫియాని చాలామంది ఈసడించుకుంటారు.అలా బాలీవుడ్ అంటే పడని వారు సైతం ప్రభాస్ జాతీయంగా ఆ స్థాయిలో నిలబడాలని కోరుకున్నారు.
అయితే అక్కడ ఉన్న ఖాన్ లు అంతా కూడా ప్రభాస్ ని కాదు మరో హీరోని నిలబడకుండా చేశారు.అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్… అంతా వేరే వీరి రాజ్యమే జరుగుతుంది.
ప్రస్తుతం కూడా వీరి హవా బాగా ఉంది.

నిజానికి ప్రభాస్ మంచి పాన్ ఇండియా స్టామినా ఉన్న హీరోనే.కానీ కథల ఎంపికలో కొన్ని పొరపాట్లు, అలాగే ఫిట్నెస్ కాపాడుకోలేకపోవడం, దైహికంగా కొన్ని సమస్యలు అతనిని వేధించడం, అందువల్ల వరుస ప్లాపులు కూడా పలకరించడం వల్ల ప్రభాస్ కాస్త వెనుక పడ్డాడు.కానీ అతని క్రేజ్ ఏ మాత్రం వెనక్కి వెళ్ళలేదు అనేది నిజం.
ప్రభాస్ తప్పులు చేయడం అక్కడ హీరోలకు వరంగా మారింది.ముఖ్యంగా ఖాన్ బ్యాచ్ అంతా కూడా ప్రభాస్ కి వ్యతిరేకంగా పావులు కలిపారు.
షారుఖ్ ఖాన్ అయితే ఒక సిండికేట్ నే శాసించే స్థాయిలో ఉన్నాడు కాబట్టి విశ్వ ప్రయత్నాలు చేశాడు.తమ స్వార్థం కోసం సలార్ సినిమాపై ( Salaar )తమ పట్టు ఉన్న థియేటర్లను ఏమాత్రం వదలలేదు.
మరి ముఖ్యంగా పివిఆర్- ఐనాక్స్ ని మొహం పగిలిపోయేలా సలార్ మేకర్స్ చేయగలిగారు అంటే అది సినిమాపై వారికున్న గట్టిని నమ్మకమే అని చెప్పాలి. షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) కి వీరంతా కొమ్ము కాస్తూ వస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా ఈ ఖాన్ రాజ్యం లో సలార్ ఎలా ముందుకు వెళుతుంది అనేది ప్రశ్న ఉన్నప్పటికీ ఈ పోటీలో సలార్ ఖచ్చితంగా నెగ్గిందనే చెప్పాలి.

ప్రశాంత్ ( Prashanth neel )కావాలని చెప్పాడో లేదంటే యాదృచ్ఛికంగా పెట్టాడో కానీ ఈ సినిమాలో ఖాన్సార్ అనే ఒక ఏరియా ఉంది.అంటే ముగ్గురు ఖాన్ల రాజ్యం అని అర్థం.ఇక బాలీవుడ్ లో కూడా ముగ్గురు ఖాన్లు ఉన్నారు.
వారే సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ఈ ముగ్గురు ఖాన్ ల రాజ్యాన్ని ప్రభాస్ ఖచ్చితంగా గెలిచినట్టే కనిపిస్తోంది అచ్చం సినిమాలోలాగానే.







