ప్రశాంత్ నీల్( Prashanth neel ) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతున్నటువంటి పేరు తాజాగా ఈయన దర్శకత్వంలో వచ్చినటువంటి సలార్( Salaar ) సినిమా మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయింది.ఇక ఇదివరకే ప్రశాంత్ కే జి ఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినటువంటి ప్రశాంత్ నీల్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు పరిమితమయ్యారని చెప్పాలి.

ఈయన కన్నడ( Kannada ) సినిమాలు ఉగ్రం అనే సినిమా ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అనంతరం కేజీఎఫ్ సినిమా ద్వారా సెన్సేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు.ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ తన సినిమాలన్నీ కూడా టాలీవుడ్ హీరోలతోనే తీస్తున్నారు.ప్రస్తుతం సలార్ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు .ఈ సినిమా తర్వాత ఈయన ఎన్టీఆర్ ( Ntr )తో మరో సినిమా కూడా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కూడా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇలా కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా సక్సెస్ అందుకొని తెలుగు ఇండస్ట్రీలో( Tollywood ) స్థిరపడటంతో ఈయన పట్ల కొంతమంది కన్నడ దర్శకులు పరోక్షంగా కామెంట్లు కూడా చేశారు.

ఇలా కన్నడ చిత్ర పరిశ్రమలు సక్సెస్ అయినటువంటి ప్రశాంత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడటానికి గల కారణాన్ని ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.టాలీవుడ్ ఇండస్ట్రీ కన్నడ చిత్ర పరిశ్రమతో పోలిస్తే చాలా పెద్దదని ఇక్కడ కనుక ఉంటే స్టార్ హీరోలతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేసే అవకాశాలు ఉంటాయన్న కారణంతోనే తాను తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చానని ప్రశాంత్ తెలిపారు.తన సినిమాలను ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయం చేయడానికి ఇక్కడైతేనే అవకాశం ఉంటుంది అంటూ ఈయన కామెంట్ చేయడంతో చాలామంది ఈయన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు.