చలికాలంలో ( winter )శరీరంలో, సహజంగా జీవక్రియలు వేగవంతం అవడంతో అధిక కేలరీలు కరిగించి బరువు తగ్గాలంటే వారికి ఇది మంచి సీజన్ అని చెబుతారు.వేసవిలో కొద్దిగా కష్టపడితే చెమటలు వచ్చే పరిస్థితి కావడంతో అందుకు భిన్నంగా చలికాలం వ్యాయామానికి అధిక సమయం ఇవ్వాల్సి ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వారు ఈ సీజన్లో ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.ఇక చలికాలంలో వ్యాయామంతో పాటు ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం ద్వారా కూడా బరువు నియంత్రణలో ఉంటుంది.
ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు( Fiber antioxidants ) పుష్కలంగా లభించే ఆహారం తీసుకోవడం మంచిది.

యాంటీ యాక్సిడెంట్ సమృద్ధిగా ఉండే పండ్లు చలికాలంలో వచ్చే అనారోగ్యాలను దరిచేరనీయవు.అయితే ఈ చలికాలంలో ప్రత్యేకమైన కొన్ని వింటర్ ఫ్రూట్స్ లభిస్తాయి.అయితే వీటిని తీసుకోవడం వలన మీకు శరీరానికి అవసరమైన పోషకాలు అంది చలికాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లను పోరాడవచ్చు.
అయితే వింటర్లో యాపిల్,బెర్రీస్( Apple berries ) లాంటి పోషకాలతో నిండిన పండ్లు లభిస్తాయి.వీటిని తీసుకోవడం వలన శరీరానికి చలికాలంలో కావాల్సిన సరైన పోషకాలు లభిస్తాయని, వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు అని న్యూట్రీషియన్లు చెబుతున్నారు.

అలాగే చలికాలంలో ఏ ఏ పండ్లు తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిదో కూడా సూచిస్తున్నారు.ముఖ్యంగా చలికాలంలో ఆపిల్స్, బెర్రీస్,( Apples berries ) పియర్స్, ద్రాక్ష, ఆరెంజ్, కివి, దానిమ్మ, జామ, స్టార్ ఫ్రూట్ లాంటి పండ్లు చలికాలంలో ఆరోగ్యానికి మంచివి.కానీ ఇందులో కొన్ని పండ్లు సులభంగా లభించనప్పటికీ వాటిని తీసుకోవడం వలన చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఈ పండ్లలో అన్ని పండ్లు దొరక్కపోయినా సులభంగా లభించే పండ్లను అయినా తీసుకోవాలి.అప్పుడే ఆరోగ్యంగా ఉండవచ్చు.కాబట్టి చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ వింటర్ ఫ్రూట్స్ ( Winter fruits )ను తినాల్సిందే.







