నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) వరుస సక్సెస్ లతో దూసుకు పోతున్న విషయం తెలిసిందే.ఇటీవలే మరో సినిమాతో వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మూడు హిట్స్ అందుకున్న బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
ఇలా హ్యాట్రిక్ విజయాలతో బాలయ్య ఫ్యాన్స్ ను మరింత ఉత్సాహ పరిచాడు.
దీంతో ఈయన నెక్స్ట్ సినిమాలపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ఆడియెన్స్ కూడా ఈయన నెక్స్ట్ చేస్తున్న సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు.
కాగా బాలయ్య ప్రజెంట్ మరో కొత్త సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు.

యంగ్ డైరెక్టర్ బాబీ ( Director Bobby ) దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.”NBK109” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటన రాగానే రెగ్యురల్ షూట్ స్టార్ట్ చేసుకుని శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి.

మరి తాజాగా మరో విషయం వైరల్ అవుతుంది.ఈ సినిమా షూట్ నెక్స్ట్ షెడ్యూల్ రాజస్థాన్ లో( Rajasthan ) జరగనుందని.ఈ కీలక షెడ్యూల్ లో బాలకృష్ణ కూడా జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తుంది.ఇంతేకాదు మరికొద్ది రోజులోనే ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ ను కూడా రివీల్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.
మరి బాబీ ఈ సినిమాను ఎలా డైరెక్ట్ చేస్తున్నాడో వేచి చూడాల్సిందే.
ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా నిర్మాతలుగా నాగ వంశీ( Nagavamshi ) త్రివిక్రమ్ భార్య సౌజన్య( Sowjanya ) వ్యవహరించ బోతున్నారు.
థమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.