మొసలి నోట్లోకి వెళ్లిన వ్యక్తి.. బయటికి చెయ్యి ఎలా పెట్టాడో చూస్తే షాకే..

మొసళ్లు చాలా క్రూరమైనవి.ఈ మాంసాహార జీవులు ఒక్కసారి దేన్నైనా మింగితే అవి ప్రాణాలతో బయటపడడం దాదాపు అసాధ్యం.

 Man Swollen By Crocodile Turn Out To Be A Robot Crocodile Video Viral Details, V-TeluguStop.com

నిజానికి వీటి దవడలు చాలా బలంగా ఉంటాయి.దేనినైనా కరకరా నమిలి వేయగలవు.

ఒకసారి మూసుకున్న వీటి దవడలు తెరవడం కూడా కష్టమే.ఇవి మనుషులను కూడా మింగిన సంఘటనలు ఉన్నాయి.

అయితే తాజాగా ఒక మనిషి ఓ పెద్ద మొసలి( Crocodile ) నోటి లోపలికి వెళ్ళిపోయాడు.కానీ అతడు బతికే ఉన్నాడు.

మొసలి లోపలికి వెళ్లి దాని లోపల చిక్కుకుపోయిన ఒక బాటిల్ ని బయటికి తీసుకొచ్చి వేరొక వ్యక్తికి ఇచ్చాడు.ఆ వేరొక వ్యక్తి మొసలి లోపల ఇరుక్కున్న ఈ వ్యక్తిని బయటికి లాగాడు.

ఇది చూసేందుకు నమ్మేలా లేదు.ఎందుకంటే ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు లేదు మొసలి నోట్లోకి వెళ్ళాక కూడా అది ఎలా సాధ్యం? అనే సందేహం మనకి కలగక మానదు.అయితే ఇది నిజమైన మొసలి లాగా కనిపించినా దానిని పరిశీలనగా చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది.అదేంటంటే ఇది ఒక రోబో మొసలి.( Robot Crocodile ) దీనిని మనుషులే తయారు చేశారు.కానీ చాలా రియల్లిస్టిక్ గా ఉండటం వల్ల అది అసలైన మొసలి అని చాలామంది భ్రమ పడుతున్నారు.

కానీ అసలు సంగతి తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఎర్త్ యానిమల్ పిక్స్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ 7 లక్షల పైగా లైక్స్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.దీనిని చూసే కొంతమంది ఇది ఫేక్ క్రొకోడైల్ కాస్ట్యూమ్( Fake Crocodile Costume ) అయి ఉంటుందని కామెంట్లు పెట్టారు.

అయితే ఇలాంటి ఫేక్ క్రొకోడైల్ తయారు చేసే వీరు ఏం సాధిస్తారు అనేది మాత్రం తెలియ రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube