తమిళ హీరో సూర్య గురించి మనందరికీ తెలిసిందే.హీరో సూర్య( Hero Surya ) కొన్ని తెలుగు సినిమాలలో నటించడంతో పాటు ఆయన నటించిన తమిళ సినిమాలు కొన్ని తెలుగులోకి కూడా విడుదల అయ్యాయి.
ఈయనకు టాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.హీరో సూర్య హీరోయిన్ జ్యోతిక( Jyothika ) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఆ సంగతి పక్కన పెడితే ఇటీవలే హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం తల్లిదండ్రులతో గొడవపడి చెన్నైను వదిలేసి ముంబై కి( Mumbai ) ముకాం మార్చినట్టుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
అలాంటిదేమీ లేదు పిల్లల చదువు కోసం మాత్రమే ముంబైకి వెళ్లినట్టు కూడా వార్తలు వినిపించాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ జ్యోతిక అసలు విషయాన్నీ బయటపెట్టింది.ఈ సందర్భంగా జ్యోతికా మాట్లాడుతూ.కరోనా( Corona ) సమయంలో నా తల్లిదండ్రులకు వైరస్ సోకింది.ఆ సమయంలో విమాన సేవలు లేకపోవడంతో వారి వద్దకు వెళ్లలేకపోయాను.

25 యేళ్లుగా చెన్నైలోనే( Chennai ) ఉంటున్నాను.నా తల్లిదండ్రులతో కలిసి ఉన్న సమయం చాలా తక్కువ.వివాహం తర్వాత ప్రతి మహిళా తమ తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలను చూసుకోలేక పోతోంది.వివాహం తర్వాత బాధ్యతలు కూడా పెరిగిపోవడంతో వాటిని పక్కనబెట్టి, తల్లిదండ్రులతో గడపలేని పరిస్థితి నెలకొంది.

అందుకే కొంతకాలం వారితో ఉండాలన్న ఆలోచనతోనే ముంబైకు వెళ్లాము.ఇది కేవలం తాత్కాలిక నిర్ణయం మాత్రమే.పిల్లలు స్కూల్‌కు వెళ్లేందుకు సులభంగా ఉంది.నా భర్త సూర్య ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారు.నేను, పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు అని జ్యోతిక చెప్పుకొచ్చింది.తన మాటలతో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు జ్యోతిక పరోక్షంగా చెక్ పెట్టింది.







