సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలెబ్రిటీలకు సంబంధించినటువంటి బయోపిక్ ( Biopic ) సినిమాలు ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.కేవలం సినిమా సెలబ్రిటీల గురించి మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు క్రీడా రంగానికి చెందినటువంటి ప్రముఖ వ్యక్తుల గురించి ఇప్పటికే ఎన్నో బయోపిక్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswararao ) బయోపిక్ సినిమా గురించి కూడా గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి.

ఇకపోతే ఇటీవల నాగేశ్వరరావు కుమార్తె నాగ సుశీల ( Naga Suseela ) మహా మాక్స్ అనే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తమ ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.నాన్న మాట తీరు చాలా కటువుగా ఉంటుందని నాన్న చాలా కోపంగా ఉంటారని మా అమ్మ ఎప్పుడు చెబుతూ ఉండేది కానీ మా నాన్న ఎప్పుడూ కూడా మాతో అలా ప్రవర్తించలేదని ఎప్పుడు ప్రేమగా అందరిని దగ్గరకు తీసుకునేవారని తెలియజేశారు.
ఇక వేసవి కాలంలో సెలవులు వస్తే తన మనవళ్లు మనవరాలు అందరూ కూడా తన దగ్గరే ఉండాలని తనతో పాటు షూటింగ్ లోకేషన్ కి కూడా తీసుకువెళ్లే వారని ఎక్కువగా ఊటీ వెళ్లే వాళ్ళం అంటూ నాగ సుశీల ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇక నాగేశ్వరరావు సినిమాల గురించి కూడా ఈమె మాట్లాడారు.నేను నాన్న సినిమాలో ఎక్కువగా చూడనని నాగ సుశీల తెలిపారు.ఎందుకంటే ఆ సినిమాలలో నాన్నను ఎవరైనా కొడుతూ ఉంటే ఆ సన్నివేశాలను నేను చూడలేనని అది సినిమా అని తెలిసినప్పటికీ కానీ ఆ విషయాన్ని నేను జీర్ణించుకోలేను అందుకే నాన్న సినిమాలు చూడనని ఈమె తెలియజేశారు.
ఇక నాగేశ్వరరావు బయోపిక్ సినిమా కనుక తీస్తే ఏ హీరో అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు అంటూ ఈయనకు ప్రశ్న ఎదురైంది.ఈ ప్రశ్నకు నాన్న బయోపిక్ సినిమా చేయాలి అంటే అందులో కేవలం నాగార్జున( Nagarjuna ) మాత్రమే నటించాలని ఆయన అయితేనే చాలా అద్భుతంగా నటిస్తారు అంటూ నాగ సుశీల చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.







