ఆ హీరో సినిమా టికెట్ కోసం లక్ష ఖర్చు చేసిన ఉపాసన?

మెగా కోడలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఉపాసన కొణిదెల ( Upasana Konidela ) ఒకరు ఈమె అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు.ఇలా మెగా కోడలుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఉపాసన తెలుగు సినిమాలకంటే బాలీవుడ్ సినిమాలను బాగా చూస్తాను అంటూ ఇదివరకు పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు.

 Upasana Spent One Lakh Rupee For That Star Hero Movie, Upasana, Tollywood ,-TeluguStop.com

ఇకపోతే ఈమెకు తెలుగులో అయితే విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) అంటే చాలా ఇష్టం అని ఆయన సినిమాలను తప్పకుండా చూస్తూ ఉంటాను అంటూ ఉపాసన పలు సందర్భాలలో తెలిపారు.

Telugu Bollywood, Ramcharan, Shahrukh Khan, Tollywood, Upasana, Venkatesh-Movie

ఇక బాలీవుడ్ సినిమాల విషయానికి వస్తే ఈమె హీరో షారుక్ ఖాన్( Shahrukh Khan ) కి వీరాభిమాని అని తెలుస్తుంది.షారుక్ ఖాన్ సినిమాలు కనుక వస్తే ఊర మాస్ థియేటర్లో ప్రేక్షకుల అరుపులు గోల మధ్య సినిమా చూస్తూ ఎంజాయ్ చేసేవారట గతంలో షారుఖ్ ఖాన్ సినిమా విడుదలవుతుంది అంటే మొదటి ఆటకే టికెట్ కొనుక్కొని చేసి తప్పకుండా ఆ సినిమా చూసే వాళ్ళని తెలుస్తుంది అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా షారుఖ్ ఖాన్ సినిమా కోసం ఈమె ఏకంగా లక్ష రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తుంది.మరి ఏ సినిమా కోసం ఈమె లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు అనే విషయానికి వస్తే…

Telugu Bollywood, Ramcharan, Shahrukh Khan, Tollywood, Upasana, Venkatesh-Movie

షారుక్ ఖాన్ హీరోగా నటించిన వాంటెడ్ ( Wanted ) సినిమా కోసం ఈమె ఏకంగా లక్ష రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది.ఈ సినిమా విడుదల సమయంలో ఉపాసన ఇండియాలో కాకుండా అమెరికాలో ఉన్నారట అయితే ఈ సినిమాని మొదటి రోజే ఇండియాలో చూడటం కోసం ఈమె అమెరికా నుంచి ఏకంగా లక్ష రూపాయలు పెట్టి ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసి ఇండియా వచ్చి మరి ఈ సినిమా చూశారని తెలుస్తోంది.ఈ విధంగా ఉపాసన షారుఖ్ ఖాన్ సినిమా చూడటం కోసం లక్ష రూపాయలు ఖర్చు చేశారనే విషయం తెలియడంతో ఈమె ఆ హీరోకి ఎంత వీరాభిమానో తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube