పార్లమెంట్ భద్రతా అంశంపై విచారణ జరపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.బీజేపీ ఎంపీ సిఫారసులతోనే నిందితులకు పాసులు వచ్చాయన్న ఆయన నిందితులను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపారు.
పార్లమెంట్ లో భద్రతపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు.విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.ప్రభుత్వం మారిందన్న విషయం బీఆర్ఎస్ నేతలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు.







