ఇరుకైన ఘాట్ రోడ్డులో ఎదురు పడ్డ కార్లు.. డ్రైవర్ చేసిన పనికి అంతా షాక్..

కారు డ్రైవింగ్( Car Driving ) అంటే చాలా మంది ఇష్టపడతారు.ఇక కారులో లాంగ్ డ్రైవ్‌కు వీకెండ్‌లో ప్లాన్ చేసుకుంటారు.

 Mans Impeccable Driving Skills On A Ghat Road Left Anand Mahindra Shocked Detail-TeluguStop.com

తమకు ఇష్టమైన ప్రదేశాలు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తారు.అయితే ఘాట్ రోడ్లలో( Ghat Road ) కారు డ్రైవింగ్ అనేది చాలా కష్టసాధ్యమైన పని.ఒక వాహనం మాత్రమే వెళ్లాల్సిన చోట రెండు వాహనాలు ఎదురు పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది.ఏ మాత్రం పట్టు తప్పినా కొండపై నుంచి కింద పడి కారులో ఉన్న వారు చనిపోయే ప్రమాదం ఉంది.

అయితే కొందరు మాత్రం చాలా కష్టమైన వాటిని సులువుగా చేస్తేస్తారు.

ముఖ్యంగా కారు డ్రైవింగ్ పట్ల ఎంతో నైపుణ్యం ఉన్న వారు మాత్రమే రిస్క్ స్టంట్లు చేయగలరు.

ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దానిని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశారు.

అయితే దీనిని మాత్రం ఇంట్లో ప్రయత్నించవద్దని కోరారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఇటీవల సోషల్ మీడియాలో అద్భుతమైన డ్రైవింగ్ నైపుణ్యానికి సంబంధించిన వీడియో చూసి మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా షాక్ అయ్యారు.ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా ఊపిరి ఆగిపోయినట్లు ఉంటుంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఇరుకైన ఘాట్ రోడ్డులో రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తున్నట్లు కనిపిస్తున్నాయి.సాధారణంగా ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఒకదానికొకటి పక్క నుంచి వెళ్లిపోతాయి.

అయితే ఆ రోడ్డులో కేవలం ఒక వాహనం మాత్రమే వెళ్లడానికి వీలుంది.కానీ విసుగు చెందడం లేదా ఒకరితో ఒకరు వాదించుకోవడం కాకుండా, ఇరుకైన ఈ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్ల డ్రైవర్లు అవగాహన చూపించారు.

ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి, కారు డ్రైవర్లు( Car Drivers ) ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు.దీని తర్వాత జరిగేది అద్భుతం అంటే అతిశయోక్తి లేదు.డ్రైవర్ అసాధారణమైన డ్రైవింగ్ నైపుణ్యాలను( Driving Skills ) ప్రదర్శిస్తాడు.అతను తన కారును పక్క గోడపైకి ఏటవాలుగా నడిపాడు.అలా ముందుకు పోనిచ్చాడు.అతడి కారుకు కానీ, మరో కారుకు కానీ ఎక్కడా చిన్న గీత కూడా పడలేదు.

ఈ విన్యాసం మహీంద్రాను ఆశ్చర్యపరిచింది.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశారు.

ఇలాంటి స్టంట్స్ ఎవరూ చేయొద్దని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube