కొందరు వ్యక్తులు అడ్వెంచర్స్ చేయడానికి బాగా ఇష్టపడుతుంటారు, దానితో వచ్చే థ్రిల్ ఎంజాయ్ చేయడానికి మరింత ఇంట్రెస్ట్ చూపిస్తారు.ప్రమాదకరమైన, భయానకమైన పనులను చేయడానికి కూడా వారి వెనకాడరు.
అటువంటి అడ్వెంచరర్స్‌లో ఒకరైన జియో మాస్టర్స్( jio Masters ) ఇటీవల న్యూక్లియర్ కూలింగ్ టవర్‌లోకి జంప్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.ఆ జంప్ చేయడానికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు.
ఆ వీడియోకు “న్యూక్లియర్ కూలింగ్ టవర్‌లోకి దూకడం” అని క్యాప్షన్ జోడించాడు.న్యూక్లియర్ కూలింగ్ టవర్( Nuclear cooling tower ) అనేది పవర్ ప్లాంట్‌లో ఒక భాగం, ఇది నీటిని చల్లబరుస్తుంది.
ఎక్స్‌ట్రా వేడిని గాలిలోకి విడుదల చేస్తుంది.కూలింగ్ టవర్లు చాలా పొడవుగా, 200 మీటర్ల వరకు ఉంటాయి.జియో మాస్టర్స్ ఇంత పెద్ద భారీ నిర్మాణం అంచున నిలబడి, సర్క్యులర్ ఓపెనింగ్ వైపు చూస్తున్నట్లు వైరల్ వీడియోలో మనం చూడవచ్చు.తరువాత అతను అంచు నుంచి టవర్‌లోకి దూకుతాడు, అతను చాలా కిందికి వెళ్ళగానే అతడు తన పారాచూట్‌ను ఓపెన్ చేస్తాడు.
ఈ దృశ్యాలు చూస్తే గుండెలు అదురుతాయి అని చెప్పుకోవచ్చు.

వీడియోలో అతని జంప్‌ని వివిధ కోణాల నుంచి చూపించే మరొక వెర్షన్ ఉంది.అది చూస్తే అన్‌రియల్లిస్టిక్ గా అనిపిస్తుంది.ఈ వీడియో చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆశ్చర్యపరిచింది, అతను టవర్ నుండి ఎలా బయటపడ్డాడు, ఎక్కడ దిగాడు, లోపల రేడియో యాక్టివ్ పదార్థం ఏమైనా ఉందా అనే సందేహాలతో చాలామంది కామెంట్స్ చేశారు.
వారిలో కొందరు అతని ధైర్యం, నైపుణ్యాన్ని ప్రశంసించారు, మరికొందరు అతని మూర్ఖత్వాన్ని విమర్శించారు.

జియో మాస్టర్స్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పెద్ద ఫాలోయింగ్ ఉన్న 21 ఏళ్ల అథ్లెట్.అతను గురుత్వాకర్షణ, లాజిక్ కు ధిక్కరించే ఫ్లిప్‌లు, జంప్‌లు, ఇతర విన్యాసాలు చేస్తున్న వీడియోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తాడు.అతడు చేసిన స్టంట్ వీడియోను మీరు కూడా చూసేయండి.







