తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) ఎట్టకేలకు ముగిసింది.అయితే బిగ్ బాస్ షో ముగిసిన కూడా పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) అభిమానుల రచ్చ మాత్రం తగ్గడం లేదు.
బిగ్ బాస్ హౌస్ లోకి ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించాడు.ఎక్కడో మారుమూల గ్రామం నుంచి రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాడు.
మొదట హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రశాంత్.రైతు బిడ్డ అంటూ గర్వంగా చెప్పుకున్నాడు.
సెప్టెంబర్ 3న ప్రారంభం రోజు పల్లవిప్రశాంత్ కు నాగార్జున ఒక మిర్చి మొక్కను ఇచ్చాడు.

దాన్ని నేను కాపాడుకుంటా అంటూ చెప్పి పల్లవి ప్రశాంత్ లోపలికి అడుగుపెట్టాడు.ఇక ఇంట్లోకి వెళ్లాకా ప్రశాంత్, రతికాతో పులిహోర కలుపుతూ పక్కదారిపట్టాడు.ఇక రతికతో ప్రేమాయణం నడుపుతూ మిర్చి మొక్కను( Mirchi Plant ) మరిచిపోయాడు.
ఇక రెండో వారం నామినేషన్స్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పై ఇంటి సభ్యులు విరుచుకుపడ్డారు.నాగార్జున( Nagarjuna ) కూడా మొక్క ఎండిపోవడంతో పల్లవి ప్రశాంత్ కు గడ్డిగా బుద్ధి చెప్పాడు.
అసలు నువ్వు రైతుబిడ్డ వేనా అంటూ నిలదీయడంతో దెబ్బకు సెట్ అయినా ఆ పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత ఆ మొక్కను మళ్ళీ జాగ్రత్తగా కాపాడుకోవడం మొదలు పెట్టాడు.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా పల్లవి ప్రశాంత్ తాజాగా టైటిల్ విన్ అవ్వడంతో ట్రోఫీ గెలుచుకున్న తర్వాత రైతులకు రుణపడి ఉంటాను అంటూ వెల్లడించాడు.అంతే కాదు.తన ప్రైజ్ మనీని రైతుల కోసం వాడుతానని తెలిపాడు.
అయితే పల్లవి ప్రశాంత్ కప్ కొట్టుకెళ్లాడు కానీ మిర్చి మొక్కను మరిచిపోయాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.అంతలా మిర్చి మొక్కతో డ్రామా చేసిన పల్లవి ప్రశాంత్ దాన్ని ఎలా బిగ్ బాస్ ఇంట్లోనే వదిలేశావ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అసలురైతు బిడ్డవేనా అంటూ సిరియస్ అవుతున్నారు.సంబరంలో ఆ మొక్కను మర్చిపోయి వెళ్లావు అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
మరి ఈ వ్యాఖ్యలపై, ఈ కామెంట్స్ పై పల్లవి ప్రశాంత్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.







